విజేత పాకిస్తాన్‌

Published on Sun, 11/30/2025 - 02:55

రావల్పిండి: సొంతగడ్డపై జరిగిన ముక్కోణపు టి20 టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌ జట్టు విజేతగా నిలిచింది. గ్రూప్‌ దశలో చక్కటి ప్రదర్శన కనబర్చిన ఆతిథ్య పాకిస్తాన్‌... ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించింది. శనివారం జరిగిన తుదిపోరులో పాకిస్తాన్‌ 6 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసి ట్రోఫీ కైవసం చేసుకుంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 19.1 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. కమిల్‌ మిశ్రా (47 బంతుల్లో 59; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. 

పాక్‌ బౌలర్ల ప్రతాపానికి శ్రీలంక బ్యాటర్లు నిలవలేకపోయారు. కమిల్‌ ఒక్కడే అర్ధశతకం సాధించగా... పాథుమ్‌ నిశాంక (11), కుషాల్‌ మెండిస్‌ (14) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. పవన్‌ రత్ననాయకే (8), కుషాల్‌ పెరెరా (1), కెపె్టన్‌ దసున్‌ షనక (2), జనిత్‌ లియాంగే (0), వణిండు హసరంగ (5) ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు వరుస కట్టారు. 

పాకిస్తాన్‌ కెప్టెన్‌ షాహీన్‌ షా అఫ్రిది 3 ఓవర్లలో 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... మొహమ్మద్‌ నవాజ్‌ 4 ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అబ్రార్‌ అహ్మద్‌కు 2 వికెట్లు దక్కాయి. బౌలింగ్‌లో క్రమశిక్షణ కనబర్చిన పాకిస్తాన్‌ బ్యాటింగ్‌లోనూ ఫర్వాలేదనిపించింది. లక్ష్యం పెద్దది కాకపోవడంతో నిదానంగా ఆడి విజయం సాధించింది. ఛేదనలో పాక్‌ 18.4 ఓవర్లలో 118 పరుగులు చేసి గెలిచింది. 

మాజీ కెప్టెన్  బాబర్‌ ఆజమ్‌ (34 బంతుల్లో 37 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌), సయీమ్‌ అయూబ్‌ (33 బంతుల్లో 36; 6 ఫోర్లు), సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (23; 2 ఫోర్లు, 1 సిక్స్‌) తలా కొన్ని పరుగులు చేసి జట్టు విజయానికి సహకరించారు. శ్రీలంక బౌలర్లలో పవన్‌ రత్ననాయకే 2 వికెట్లు పడగొట్టాడు. మొహమ్మద్‌ నవాజ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డులు దక్కాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)