Breaking News

బంగ్లాదేశ్‌ చేతిలో ఘెర పరాజయం.. ఎనిమిదో స్థానానికి పడిపోయిన పాకిస్తాన్‌

Published on Sun, 08/25/2024 - 17:45

తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో ఘెర పరాజయం అనంతరం పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25 పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. పాక్‌పై సంచలన​ విజయం అనంతరం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్‌ ఆరో స్థానానికి ఎగబాకింది. 

ఈ రెండు మార్పులు మినహా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పులు జరగలేదు. 68.52 విజయాల శాతంతో భారత్‌ టాప్‌లో కొనసాగుతుండగా.. 62.50 విజయాల శాతంతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో.. 50 శాతం విజయాలతో న్యూజిలాండ్‌ మూడులో.. 41.07 విజయాల శాతంతో ఇంగ్లండ్‌ నాలుగో స్థానంలో.. 40 శాతం విజయాలతో శ్రీలంక ఐదో స్థానంలో ఉన్నాయి. 38.89 విజయాల శాతంతో సౌతాఫ్రికా ఏడులో.. 18.52 విజయాల శాతంతో వెస్టిండీస్‌ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.

కాగా, రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బంగ్లాదేశ్‌ 565 పరుగులు చేసి ఆలౌటైంది.

సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్‌ 146 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. వికెట్‌ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇది తొలి టెస్ట్‌ విజయం. పాక్‌ను వారి సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో మట్టికరపించిన తొలి జట్టు కూడా బంగ్లాదేశే కావడ​ం విశేషం. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో బంగ్లాదేశ్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్‌ ఆగస్ట్‌ 30న ఇదే వేదికగా జరుగనుంది.

స్కోర్‌ వివరాలు..

పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌ 448/6 (సౌద్‌ షకీల్‌ 141, మొహమ్మద్‌ రిజ్వాన్‌ 171 నాటౌట్‌, హసన్‌ మహమూద్‌ 2/70)

బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ 565 (ముష్ఫికర్‌ అహ్మద్‌ 191, షడ్మాన్‌ ఇస్లాం 93, నసీం షా 3/93)

పాకిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌ 146 (మొహమ్మద్‌ రిజ్వాన్‌ 51, మెహిది హసన్‌ 4/21)

బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌ 30/0 (జకీర్‌ హసన్‌ 15 నాటౌట్‌)

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)