Breaking News

ఉత్కంఠ పోరు.. సూపర్ ఓవర్‌లో పాకిస్తాన్ విజయం

Published on Mon, 11/24/2025 - 10:45

ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 ఛాంపియన్స్‌గా  పాకిస్తాన్ షాహీన్స్ నిలిచింది. ఆదివారం దోహ వేదికగా బంగ్లాదేశ్‌-ఎ జట్టుతో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో పాకిస్తాన్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. తద్వారా వరుసగా మూడో ఆసియాకప్ కప్ రైజింగ్ స్టార్స్ టైటిల్‌ను పాక్ కైవసం చేసుకుంది.

ఈ తుది పోరులో తొలుత ‍బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్‌-ఎ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 125 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఆరంభంలో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత  మాజ్ సదాకత్ (18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 23) , అరఫాత్ మిన్హాస్( 23 బంతుల్లో 4 ఫోర్లతో 25) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

ఆఖరిలో  సాద్ మసూద్ (26 బంతుల్లో 38) దూకుడుగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. బంగ్లాదేశ్-ఎ బౌలర్లలో రిపన్ మోండల్ మూడు వికెట్లు పడగొట్టగా.. రకిబుల్ హసన్ రెండు, మెహెరోబ్, జిషన్ అలామ్, అబ్దుల్ గఫ‌ర్‌ సక్లెయిన్ తలా వికెట్ సాధించారు.

స్కోర్లు సమం..
అనంతరం లక్ష్య చేధనలో బంగ్లాదేశ్‌ కూడా నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. చేజింగ్‌లో హబీబుర్ రెహమాన్ సోహన్(23) మెరుపు వేగంతో ఆడ‌డంతో మ్యాచ్ త్వ‌ర‌గా ముగిసిపోతుంద‌ని అంతా భావించారు. కానీ ఆ త‌ర్వాతే బంగ్లా వికెట్ల ప‌త‌నం మొద‌లైంది. 

53 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఈ స‌మ‌యంలో రకిబుల్ హసన్(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 24), అబ్దుల్ గ‌ఫ‌ర్‌(16) దూకుడుగా ఆడ‌డంతో స్కోర్లు స‌మం అయ్యాయి. దీంతో సూప‌ర్ ఓవ‌ర్‌తో ఫ‌లితం తేల్చాల‌ని అంపైర్‌లు నిర్ణ‌యించారు.

సూప‌ర్ ఓవ‌ర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మూడు బంతుల్లో రెండు వికెట్ల న‌ష్టానికి 6 ప‌రుగుల‌కే చేసింది.  సూపర్ ఓవర్ రూల్స్ ప్రకారం రెండు వికెట్లు పడితే ఆలౌటైనట్లు ప‌రిగ‌ణిస్తారు. అహ్మద్ డానియల్ మ‌రోసారి అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.

బంగ్లా నిర్ధేశించిన 7 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పాక్ నాలుగు బంతుల్లో చేధించింది.  పాక్ విజ‌యంలో  కీలక పాత్ర పోషించిన అహ్మద్ దనియాల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. ఓపెన‌ర్‌ మాజ్ సదఖత్‌ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.
చదవండి: Prithvi Shaw: కెప్టెన్‌గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన

 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)