Breaking News

భారత్‌కు రానున్న పాకిస్తాన్‌ జట్టు..!

Published on Thu, 07/03/2025 - 19:07

ఇటీవల జరిగిన తీవ్ర పరిణామాల (పహల్గాం ఉగ్రదాడి, బదులుగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌) తర్వాత భారత్‌, పాక్‌ల మధ్య అన్ని విషయాల్లో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. క్రీడలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి. పాక్‌తో ఏ క్రీడలో అయినా తలపడేందుకు భారత్‌ నిరాసక్తత వ్యక్తం చేస్తుంది.

అయితే తాజాగా జరుగుతున్న ఓ ప్రచారం భారత క్రీడాభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆసియా కప్‌, జూనియర్‌ వరల్డ్‌కప్‌ టోర్నీల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్‌ హాకీ జట్లు భారత్‌కు రానున్నాయట. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాక్‌ హాకీ జట్లకు అనుమతి కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది.

వచ్చే నెల (అగస్ట్‌) 27 నుంచి సెప్టెంబర్‌ 7 వరకు బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఆసియా కప్‌ జరుగనుంది. ఈ టోర్నీ కోసం​ 31 మంది సభ్యుల పాకిస్తాన్‌ జట్టుకు భారత్‌కు రానున్నట్లు సమాచారం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఓ కీలక అధికారి ప్రముఖ క్రీడా వెబ్‌సైట్‌ స్పోర్ట్స్‌స్టార్‌కు చెప్పాడు.  

జూనియర్‌ హాకీ వరల్డ్‌కప్‌ నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 10 వరకు చెన్నై, మధురై నగరాల్లో జరుగనుంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు కూడా పాకిస్తాన్‌కు అనుమతి లభించినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే, భారత్‌, పాకిస్తాన్‌ త్వరలో క్రికెట్‌ ఆసియా కప్‌లో కూడా తలపడాల్సి ఉంది. అయితే, ఈ విషయంపై బీసీసీఐ ఇప్పటివరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించలేదు. ఈ టోర్నీపై ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది క్రికెట్‌ ఆసియా కప్‌ సెప్టెంబర్‌ 5 నుంచి 21వ తేదీ వరకు యూఏఈలో జరగాల్సి ఉంది. ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరుగనుంది. భారత్‌ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. 
 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)