Breaking News

నిప్పులు చెరిగిన హరీస్‌ రౌఫ్‌.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన ఆస్ట్రేలియా

Published on Sat, 11/16/2024 - 15:29

సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. హరీస్‌ రౌఫ్‌ నాలుగు వికెట్లు తీసి ఆసీస్‌ పతనాన్ని శాశించాడు. రౌఫ్‌ వికెట్లు తీయడమే కాకుండా పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. మరో బౌలర్‌ అబ్బాస్‌ అఫ్రిది మూడు వికెట్లు తీశాడు. అబ్బాస్‌ కీలకమైన మాథ్యూ షార్ట్‌ వికెట్‌తో పాటు టెయిలెండర్ల వికెట్లు తీశాడు. 

స్పిన్నర్‌ సూఫియాన్‌ ముఖీమ్‌ నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్‌ (32) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ 20, జోస్‌ ఇంగ్లిస్‌ 0, మ్యాక్స్‌వెల్‌ 21, స్టోయినిస్‌ 14, టిమ్‌ డేవిడ్‌ 18, ఆరోన్‌ హార్డీ 28, జేవియర్‌ బార్ట్‌లెట్‌ 5, స్పెన్సర్‌ జాన్సన్‌ 0 పరుగులకు ఔటయ్యారు. నాథన్‌ ఇల్లిస్‌ 1, ఆడమ్‌ జంపా 0 పరుగులతో అజేయంగా నిలిచారు. 

కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో గెలుపొందిన విషయం తెలిసిందే. 7 ఓవర్లకు కుదించిన ఆ ​మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 4 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేయగా.. పాక్‌ 7 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 64 పరుగులు మాత్రమే చేయగలిగింది. 19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)