Breaking News

వన్డే క్రికెట్‌లో పాకిస్తాన్‌ చరిత్ర.. అయినా టీమిండియా వెనకాలే

Published on Fri, 04/28/2023 - 17:20

గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో విజయాన్ని అందుకున్న పాకిస్తాన్‌ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించింది. కివీస్‌పై విజయం పాక్‌కు వన్డేల్లో 500వది కావడం విశేషం. వన్డే క్రికెట్‌లో 500 విజయాలు నమోదు చేసిన మూడో జట్టుగా పాకిస్తాన్‌ నిలిచింది.

ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా, భారత్‌ ఉన్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటివరకు 978 మ్యాచ్‌లు ఆడి 594 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా.. టీమిండియా ఇప్పటివరకు మొత్తం 1029 మ్యాచ్‌లు ఆడి 539 విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతుంది.

తాజాగా కివీస్‌పై విజయంతో పాక్‌ 949వ మ్యాచ్‌లో 500వ విజయం సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వెస్టిండీస్‌ 411, దక్షిణాఫ్రికా 399, శ్రీలంక 399, ఇంగ్లండ్‌ 392, న్యూజిలాండ్‌ 368, బంగ్లాదేశ్‌ 149, జింబాబ్వే 147 విజయాలతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి.ఇక 1973లో మొదటి వన్డే మ్యాచ్‌ ఆడిన పాకిస్తాన్‌.. 1974 ఆగస్టులో నాటింగ్‌హమ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తొలి వన్డే విజయాన్ని అందుకుంది.  1992లో వన్డే వరల్డ్‌కప్‌ నెగ్గిన పాకిస్తాన్‌.. ఆ తర్వాత 1999లో ఫైనల్‌ మెట్టుపై బోల్తా పడింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే రావల్పిండి వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ విజయం సాధించింది. 289 లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌.. 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

పాక్‌ బ్యాటర్లలో ఫఖర్ జమాన్(117) సెంచరీతో చెలరేగగా.. ఇమామ్‌ ఉల్‌ హాక్‌(60) పరుగులతో రాణించాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. కివీస్‌ బ్యాటర్లలో విల్‌ యంగ్‌(86), డార్లీ మిచెల్‌(113) పరుగులలో రాణించారు.

చదవండి: సెంచరీతో చెలరేగిన ఫఖర్ జమాన్.. న్యూజిలాండ్‌పై పాక్‌ ఘన విజయం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)