Breaking News

వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీకి పాక్‌ అర్హత

Published on Fri, 04/18/2025 - 01:03

లాహోర్‌: ఈ ఏడాది సెప్టెంబర్  –అక్టోబర్‌లలో భారత్‌ వేదికగా జరగనున్న మహిళల వన్డే వరల్డ్‌కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌కు పాకిస్తాన్‌ జట్టు అర్హత సాధించింది. పాకిస్తాన్‌లో జరుగుతున్న వరల్డ్‌కప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌లో టాప్‌–2లో నిలిచిన జట్లకు ప్రపంచకప్‌ బెర్త్‌లు లభిస్తాయి. గురువారం థాయ్‌లాండ్‌తో జరిగిన నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 87 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 205 పరుగులు చేసింది. సిద్రా అమిన్‌ (80; 9 ఫోర్లు), కెపె్టన్‌ సనా ఫాతిమా (62 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలతో రాణించారు. 

అనంతరం థాయ్‌లాండ్‌ జట్టు 34.4 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ బౌలర్లలో సనా ఫాతిమా, నష్రా సంధూ, రమీన్‌ షమీమ్‌ 3 వికెట్ల చొప్పున పడగొట్టారు.  ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న పాకిస్తాన్‌ మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ప్రపంచకప్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. శనివారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్‌ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఓడిపోయినా ఆ జట్టుకు వచ్చిన ఢోకా లేదు.

బంగ్లాదేశ్‌ గెలిస్తే ఎనిమిది పాయింట్లతో ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్రపంచకప్‌ టోర్నీకి అర్హత పొందుతుంది. బంగ్లాదేశ్‌ ఓడిపోయి... వెస్టిండీస్, స్కాట్లాండ్‌ జట్లు తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ల్లో గెలిస్తే ఈ మూడు జట్లు 6 పాయింట్లతో సమఉజ్జీగా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో మెరుగైన రన్‌రేట్‌ ఉన్న జట్టు ప్రపంచకప్‌ టోర్నీకి అర్హత సాధిస్తుంది. రన్‌రేట్‌ పరంగా బంగ్లాదేశ్‌కే మరో బెర్త్‌ దక్కే అవకాశం ఉంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)