పాకిస్తాన్‌ ప్లేయర్ల సంచలన నిర్ణయం

Published on Mon, 01/27/2025 - 16:03

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పాల్గొంటున్న పాకిస్తాన్‌ ప్లేయర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దర్బార్‌ రాజ్‌షాహీ అనే ఫ్రాంచైజీ మ్యాచ్‌ ఫీజ్‌ బకాయిలు చెల్లించని కారణంగా బీపీఎల్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్నారు. ఇదే కారణంగా పలువురు విదేశీ ప్లేయర్లు కూడా బీపీఎల్‌కు దూరంగా ఉన్నారు. విదేశీ ఆటగాళ్లు ర్యాన్‌ బర్ల్‌, మెక్‌కాలీ కమిన్స్‌, లహీరు కుమార, మార్క్‌ డోయల్‌తో పాటు పాకిస్తాన్‌ ఆటగాళ్లు మొహమ్మద్‌ హరీస్‌, అఫ్తాబ్ ఆలమ్‌  దర్బార్‌ రాజ్‌షాహీ ఆడిన గత మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేశారు. 

విదేశీ ఆటగాళ్లు హ్యాండ్‌ ఇవ్వడంతో రాజ్‌షాహీ గత మ్యాచ్‌లో లోకల్‌ ప్లేయర్లను బరిలోకి దించింది. రాజ్‌షాహీకి చెందిన విదేశీ ఆటగాళ్లు మ్యాచ్‌ ఫీజ్‌ బకాయిలను డిమాండ్‌ చేస్తూ తమ ధిక్కార స్వరాన్ని వినిపించడం ఇది తొలిసారి కాదు. ఈ సీజన్‌ ఆరంభంలో రాజ్‌షాహీ విదేశీ ఆటగాళ్లు ట్రయినింగ్‌ సెషన్స్‌ను బాయ్‌కాట్‌ చేశారు. తమ ఫ్రాంచైజీపై చర్యలు తీసుకుని, తమకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలని బీపీఎల్‌ గవర్నింగ్‌ బాడీని డిమాండ్‌ చేశారు. రాజ్‌షాహీ దర్బార్‌ ఫ్రాంచైజీ అవళంభిస్తున్న విధానాలు అంతర్జాతీయ క్రికెట్‌ వేదికపై బంగ్లాదేశ్‌ పరువును మసకబారేలా చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే, విదేశీ స్టార్లు లేనప్పటికీ గత మ్యాచ్‌లో రాజ్‌షాహీ రంగ్‌పూర్‌ రైడర్స్‌పై విజయం సాధించింది. లో స్కోరింగ్‌ థ్రిల్లర్‌గా నడిచిన ఈ మ్యాచ్‌లో రాజ్‌షాహీ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.  ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజ్‌షాహీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. రాజ్‌షాహీ ఇన్నింగ్స్‌లో సంజముల్‌ ఇస్లాం (28 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. రంగ్‌పూర్‌ రైడర్స్‌ బౌలర్లలో ఖుష్‌దిల్‌ 3 వికెట్లు పడగొట్టగా.. రకీబుల్‌ హసన్‌, సైఫుద్దీన్‌ తలో రెండు, అకీఫ్‌ జావెద్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రంగ్‌పూర్‌ రైడర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. మొహమ్మద్‌ సైఫుద్దీన్‌ (52 నాటౌట్‌), రకీబుల్‌ హసన్‌ (20) రైడర్స్‌ను గెలిపించేందుకు చివరి వరకు ప్రయత్నించారు. రాజ్‌షాహీ బౌలర్లు మృత్యుంజయ్‌ చౌధురీ (4-1-18-4), మొహర్‌ షేక్‌ (4-1-15-2), కెప్టెన్‌ తస్కిన్‌ అహ్మద్‌ (4-0-2-25) పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు వికెట్లు తీసి రైడర్స్‌ను దెబ్బకొట్టారు. ఈ గెలుపు అనంతరం రాజ్‌షాహీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ సీజన్‌లో రాజ్‌షాహీ 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి, ప్లే ఆఫ్స్‌పై కన్నేసింది.

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)