Breaking News

ఓవరాక్షన్‌ చేసిన పాక్‌ ఆటగాళ్లకు శిక్ష

Published on Wed, 07/29/2026 - 19:55

వెస్టిండీస్‌తో తాజాగా ముగిసిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్‌ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్లు ఖుర్రమ్ షెహ్‌జాద్, మహ్మద్ అబ్బాస్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.

ఇద్దరూ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు (వికెట్లు తీసిన అనంతరం ప్రత్యర్థి బ్యాటర్లను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు) తేలడంతో తలో డీమెరిట్ పాయింట్ కేటాయించింది. అలాగే అబ్బాస్‌కు అధికారిక హెచ్చరికతో పాటు ఖుర్రమ్ షెహ్‌జాద్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది. 

మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ప్రతిపాదించిన శిక్షను ఇద్దరూ అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండా పోయింది.

ఈ మ్యాచ్‌లో అబ్బాస్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. షెహ్‌జాద్ కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండేసి వికెట్లు తీశాడు. వీరిద్దరూ అద్భుతంగా రాణించినా పాక్‌కు ఓటమి తప్పలేదు. 211 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 120 పరుగులకే కుప్పకూలి 90 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రెండో టెస్ట్‌ ఆగస్టు 2 నుంచి క్వీన్స్ పార్క్‌లో జరగనుంది. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)