Breaking News

ఆసియా కప్‌ నుంచి పాకిస్తాన్‌ ఔట్‌.. ? వైరలవుతున్న సోనీ స్పోర్ట్స్‌ పోస్టర్‌

Published on Tue, 06/24/2025 - 19:14

ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగాల్సిన ఆసియా కప్‌-2025 కోసం టోర్నీ అధికారిక ప్రసారదారు సోనీ స్పోర్ట్స్‌ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో భారత్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక టీ20 జట్లకు చెందిన కెప్టెన్లు సూర్యకుమార్ యాదవ్, నజ్ముల్ శాంటో, చరిత్ అసలంక మాత్రమే ఉన్నారు. ఈ పోస్టర్‌లో పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం లేకపోవడం​ సోషల్‌మీడియాలో చర్చలకు తావిచ్చింది. ఆసియా కప్‌ నుంచి పాక్‌ వైదొలిగిందని ప్రచారం మొదలైంది.

పహల్గాం ఉదంతం, తదనంతర పరిణామాల్లో (ఆపరేషన్‌ సిందూర్‌) భారత్‌, పాక్‌ మధ్య అప్పటివరకు ఉన్న తేలికపాటి సంబంధాలు కూడా తెగిపోయిన విషయం తెలిసిందే. క్రీడలు సహా అన్ని అంశాల్లో భారత్‌ పాక్‌తో సంబంధాలు తెంచుకుంది. క్రికెట్‌కు సంబంధించి ఆసియా కప్‌, ఐసీసీ టోర్నీల్లో, అదీ తటస్థ వేదికల్లో మాత్రమే భారత్‌ పాక్‌తో మ్యాచ్‌లు ఆడే విషయం పరిశీలనలో ఉంది. వాస్తవానికి క్రికెట్‌లో కూడా భారత్‌ పాక్‌తో పూర్తి స్థాయి సంబంధాలు తెంచుకోవాలని భారతీయుల నుంచి ఒత్తిడి ఉంది.

ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా పాకిస్తాన్‌కు చెందిన మంత్రి, పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ మొహిసిన్‌ నఖ్వీ ఉండటంతో భారత్‌ ఆసియా కప్‌ నుంచి కూడా వైదొలుగుతుందని పలు నివేదికలు తెలిపాయి.

మరికొన్ని నివేదికలేమో భారత్‌ తమ దేశ క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) పరపతిని ఉపయోగించి పాకిస్తాన్‌నే ఆసియా కప్‌ నుంచి వైదొలిగేలా చేస్తుందని చెప్పాయి. తాజాగా సోనీ​ స్పోర్ట్స్‌ పాక్‌ ప్రాతినిథ్యం లేని పోస్టర్‌ను విడుదల చేయడంతో ఇదే నిజమైదేంమోనని అనిపిస్తుంది. మొత్తానికి సోనీ​ స్పోర్ట్స్‌ విడుదల చేసిన ఆసియా కప్‌ పోస్టర్‌ భారత్‌, పాక్‌ల మధ్య మరోసారి అగ్గి రాజేసేలా ఉంది.

కాగా, ఆసియా కప్‌ 2025పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ టోర్నీ యొక్క ఖచ్చితమైన వివరాలు, వేదికలు, షెడ్యూల్‌ గురించి ఏసీసీ ఎలాంటి సమాచారం ఇవ్వ లేదు. ఏసీసీ అధ్యక్షుడిగా పాక్‌కు చెందిన వ్యక్తి ఉన్నా, తమ దేశ భాగస్వామ్యంపై ఇప్పటివరకు స్పందించలేదు. కొద్ది రోజుల కిందట టోర్నీని భారత్‌లో కాకుండా యూఏఈలో నిర్వహిస్తారని కూడా ప్రచారం జరిగింది.

2031 వరకు ఏసీసీ ఈవెంట్స్ హక్కులను దక్కించుకున్న సోనీ స్పోర్ట్స్
సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) 2024 నుండి 2031 వరకు అన్ని ఏసీసీ టోర్నమెంట్‌ల మీడియా హక్కులను $170 మిలియన్ల బేస్ ధరకు దక్కించుకుంది. ఇది మునుపటి సైకిల్ కంటే 70% ఎక్కువ. ఆశ్చర్యకరంగా మీడియా హక్కుల కోసం పోటీ బిడ్డింగ్ జరగలేదు. జియోస్టార్ మధ్యలో వైదొలిగింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)