Breaking News

ఆసీస్‌తో తొలి టెస్ట్‌.. పాక్‌ జట్టు ప్రకటన.. ఇద్దరు కొత్త ఆటగాళ్ల ఎంట్రీ

Published on Wed, 12/13/2023 - 15:59

ఆస్ట్రేలియాతో రేపటి నుంచి (డిసెంబర్‌ 14) ప్రారంభం కాబోయే తొలి టెస్ట్‌ మ్యాచ్‌ కోసం పాకిస్తాన్‌ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ మ్యాచ్‌ ద్వారా ఇద్దరు ఆటగాళ్లు టెస్ట్‌ అరంగ్రేటం చేయనున్నట్లు పాక్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. ఆల్‌రౌండర్‌ ఆమిర్‌ జమాల్‌, రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఖుర్రమ్‌ షెహజాద్‌ తమ తొలి అంతర్జాతీయ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడేందుకు సిద్దంగా ఉన్నారని పీసీబీ పేర్కొంది. జమాల్‌ గతేడాది పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో పాక్‌కు తొలిసారి ప్రాతినిథ్యం వహించగా.. ఖుర్రమ్‌ షెహజాద్‌ ఏ ఫార్మాట్‌లో అయిన జాతీయ జట్టుకు ఆడటం ఇదే తొలిసారి. 

మరోవైపు ఆల్‌రౌండర్‌ ఫహీమ్‌ అష్రాఫ్‌ ఏడాది తర్వాత తిరిగి పాక్‌ టెస్ట్‌ జట్టులో చోటు దక్కించుకోగా.. పాక్‌ తమ ఫస్ట్‌ ఛాయిస్‌ వికెట్‌కీపర్‌గా మొహమ్మద్‌ రిజ్వాన్‌ను కాదని సర్ఫరాజ్‌ అహ్మద్‌వైపే మొగ్గు చూపింది. ఓపెనర్లుగా ఇమామ్‌ ఉల్‌ హాక్‌, అబ్దుల్లా షఫీక్‌లను కొనసాగించిన పాక్‌ మేనేజ్‌మెంట్‌.. వన్‌ డౌన్‌లో నయా కెప్టెన్‌ షాన్‌ మసూద్‌, ఆతర్వాతి స్థానంలో తాజా మాజీ కెప్టెన్‌ బాబార్‌ ఆజమ్‌ బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేసింది.

ఐదో స్థానంలో సౌద్‌ షకీల్‌ తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. పేస్‌ అటాక్‌ను షాహీన్‌ అఫ్రిది లీడ్‌ చేయనున్నాడు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ గాయపడటంతో సల్మాన్‌ అలీ అఘా ఆ బాధ్యతలు చేపట్టనున్నాడు.

కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం పాక్‌ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. తొలి మ్యాచ్‌ రేపటి నుంచి పెర్త్‌ వేదికగా ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌ కోసం ఆస్ట్రేలియా కూడా తమ తుది జట్టును ఇదివరకే ప్రకటించింది. వరల్డ్‌కప్‌ వైఫల్యాల నేపథ్యంలో పాక్‌ మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో షాన్‌ మసూద్‌ పాక్‌ టెస్ట్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్‌గా మసూద్‌కు ఇదే తొలి టెస్ట్‌ కావడం విశేషం.

ఆసీస్‌తో తొలి టెస్ట్‌కు పాక్‌ తుది జట్టు: ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్‌), బాబర్ ఆజమ్‌, సౌద్ షకీల్, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్‌కీపర్‌), సల్మాన్ అలీ అఘా, ఫహీమ్ అష్రాఫ్, షాహీన్ ఆఫ్రిది, అమీర్ జమాల్, ఖుర్రం షెహజాద్

ఆసీస్‌ తుది జట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్‌ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్‌.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)