Breaking News

పాకిస్తాన్‌ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిది

Published on Thu, 12/21/2023 - 13:45

వచ్చే ఏడాది జనవరిలో పాకిస్తాన్‌ జట్టు న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో పాక్‌ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ క్రమంలో  కివీస్‌తో టీ20 సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన జట్టును పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్‌పేసర్‌ షాహీన్ అఫ్రిది నాయకత్వం వహించనున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత అన్ని ఫార్మాట్లలో పాకిస్తాన్‌ కెప్టెన్సీకి బాబర్‌ ఆజం గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలోనే టీ20ల్లో పాక్‌ కొత్త కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిదిని వహాబ్‌ రియాజ్‌తో కూడిన సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. అఫ్రిదికి కెప్టెన్‌గా ఇదే తొలి సిరీస్‌. ఇక కివీస్‌తో సిరీస్‌కు స్టార్‌ ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ గాయం కారణంగా దూరంగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ హ్యారీస్‌ను సెలక్టర్లు తప్పించారు. అదే విధంగా స్పిన్నర్‌ అర్బర్‌ ఆహ్మద్‌, హసీబుల్లా ఖాన్‌కు తొలి సారి పాక్‌ టీ20 జట్టులో చోటు దక్కింది.

న్యూజిలాండ్‌తో టీ20లకు పాక్‌ జట్టు: షాహీన్ అఫ్రిది (కెప్టెన్‌), బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, హసీబుల్లా ఖాన్, ఇఫ్తీకర్ అహ్మద్, ఆజం ఖాన్, అమీర్ జమాల్, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, మహ్మద్ నవాజ్, అబ్రర్ అహ్మద్, రౌఫ్, జమాన్ ఖాన్.
చదవండి: IPL 2024-SRH Captain: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సంచలన నిర్ణయం.. !?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)