Breaking News

పొలిటికల్‌ బాంబు పేల్చిన నఖ్వీ

Published on Tue, 08/04/2026 - 16:50

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్‌ నఖ్వీ అతి పెద్ద పొలిటికల్‌ బాంబు పేల్చాడు. పాక్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి కూడా అయిన.. దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణాన్ని గుర్తించామని ప్రకటించారు. ఈ వ్యవహారంలో న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు, బ్యాంకర్లు కూడా ఉన్నారని ఆరోపించారు.

"21 ఏళ్లుగా లంచాలు ఇచ్చారు, తీసుకున్నారు. బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటాం" అని వ్యాఖ్యానించారు. అయితే కుంభకోణానికి పాల్పడ్డ వ్యక్తుల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు.

నఖ్వీ కొద్ది రోజుల కిందటే మరో సంచలన ఆరోపణ చేశారు. పాకిస్థాన్‌ పాలనా వ్యవస్థ కుప్పకూలిపోయిందని వ్యాఖ్యానించారు. నఖ్వీ వరుసగా చేస్తున్న సంచలన ఆరోపణలు పాక్‌ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి. అతడికి దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌కు పొసగడం లేదని ప్రచారం జరుగుతోంది. 

ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్ ఆదేశాలతోనే నఖ్వీ ప్రభుత్వంపై ఆరోపణుల చేస్తున్నాడని టాక్‌ నడుస్తోంది. నఖ్వీ-మునీర్‌ చాలాకాలంగా ప్రధానిపై గుర్రుగా ఉన్నారని సమాచారం. ఈ కారణంగానే వారు ఇలాంటి ఆరోపణులు చేస్తున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, నఖ్వీ పీసీబీ అధ్యక్షుడిగా, పాక్‌ అంతర్గత మంత్రిగా, ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. తాజాగా అతడు మహిళల ఆసియా కప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ డిస్కషన్‌లో పాల్గొన్నాడు. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ ప్రకటన త్వరలోనే వెలువడాల్సి ఉంది. 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)