Breaking News

ఒలింపిక్స్‌లో దాయాదుల పోరు డౌటే

Published on Sat, 11/08/2025 - 17:51

క్రికెట్.. 128 ఏళ్ల సదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలను నిర్వహించేందుకు ఒలింపిక్ కమిటీ (IOC) ఇప్పటికే ఆమోదం తెలిపింది. టీ20 ఫార్మాట్‌లో ఈ పోటీలు జరగనున్నాయి.

ఈ టోర్నీలో ఆరు జట్లు చొప్పున పురుషులు, మహిళల జట్లు  పాల్గొననున్నాయి. అయితే ఈ విశ్వక్రీడల్లో భారత్‌-పాకిస్తాన్ మ్యాచ్ చూడాలనుకుంటున్న అభిమానులకు నిరాశ ఎదురయ్యేలా ఉంది. ఎందుకంటే  ఒలింపిక్స్‌లో పాల్గొనే జట్లను ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా కాకుండా రీజియన్ల వారీగా ఎంపిక చేయాలని ఐసీసీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

తొలుత ర్యాంకింగ్స్  ఆధారంగా జట్లను ఎంపిక చేయాలని ఐసీసీ భావించినప్పటికి.. తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. ఆసియా, ఓషియానియా, యూరప్‌, ఆఫ్రికా నాలుగు  రీజియన్లలో టాప్‌లో ఉన్న జట్లకు ఒలింపిక్స్‌లో నేరుగా ప్రవేశం లభిస్తుంది. ఐదో జట్టుగా ఆతిథ్య హోదాలో అమెరికా లేదా వెస్టిండీస్ గానీ అర్హత సాధిస్తోంది. ఇక ఆరో జట్టును గ్లోబల్ క్వాలిఫయర్ ద్వారా నిర్ణయిస్తారు. 

కాగా అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా నంబర్ వన్ జట్టుగా కొనసాగుతుండడంతో ఆసియా ఖండం​ నుంచి పాకిస్తాన్‌కు చోటు దక్కే అవకాశం​ లేదు. ఒకవేళ టాప్‌-2 జట్లకు అవకాశమిస్తే మినహా పాకిస్తాన్ ఒలింపిక్స్‌లో పాల్గోనడం కష్టమే అనే చెప్పుకోవాలి. అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో పాక్ ప్రస్తుతం ఏడో స్ధానంలో కొన‌సాగుతోంది. ఇక లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌ జులై 12న ప్రారంభం కానున్నాయి.

రీజియన్ల వారీగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించే జట్లు ఇవే?
ఆసియా: భారత్‌
ఓషియానియా: ఆస్ట్రేలియా
యూరప్: ఇంగ్లండ్
ఆఫ్రికా: దక్షిణాఫ్రికా
చదవండి: IND A Vs SA A: ధ్రువ్ జురెల్ సూప‌ర్ సెంచ‌రీ.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్‌

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)