Breaking News

పాకిస్తాన్‌ జట్టు ప్రకటన.. బాబర్‌ ఆజం, షాహిన్‌కు నో ఛాన్స్‌

Published on Sun, 12/28/2025 - 11:47

శ్రీలంకతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రకటించింది. ఈ జట్టుకు సల్మాన్ అలీ అఘా నాయకత్వం వహించనున్నాడు. టీ20 వరల్డ్‌కప్-2026కు ముందు సల్మాన్ పీసీబీ వేటు వేయనున్నట్లు వార్తలు వచ్చాయి.

కానీ పాక్ క్రికెట్ బోర్డు అతడిపై మరోసారి నమ్మకం ఉచింది. కాగా ఈ సిరీస్‌కు స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్‌లు దూరమయ్యారు. వీరు ముగ్గురు ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో ఆడుతుండడంతో సెలక్టర్లు పక్కన పెట్టారు. ఈ సీనియర్ త్రయం బిగ్ బాష్ పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉండనున్నారు.

ఇక  భుజం సర్జరీ కారణంగా ఈ ఏడాది జూన్ నుంచి జట్టుకు దూరంగా స్టార్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ రీఎంట్రీ ఇచ్చాడు. ప్రపంచకప్‌ ముందు అతడి రాక జట్టుకు పెద్ద బలంగా మారనుంది. మరోవైపు డొమాస్టిక్ క్రికెట్‌లో దుమ్ములేపుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ ఖవాజా నఫాయ్‌కు తొలిసారిగా జాతీయ జట్టులో చోటు దక్కింది. ఈ సిరీస్ జనవరి 7 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం మూడు మ్యాచ్‌లు డంబుల్లా వేదికగానే జరగనుంది. టీ20 ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది.

మ్యాచ్‌ల షెడ్యూల్ (దంబుల్లా):
మొదటి టీ20: జనవరి 7

రెండవ టీ20: జనవరి 9

మూడవ టీ20: జనవరి 11

శ్రీలంకతో టీ20లకు పాక్‌ జట్టు: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా నఫాయ్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్), సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ తారిఖ్.
చదవండి: IND vs NZ: రిష‌బ్ పంత్‌కు భారీ షాక్‌.. జ‌ట్టులోకి డ‌బుల్ సెంచ‌రీ వీరుడు!
 

Videos

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

నామినేషన్లకు వస్తే.. కంకర రాళ్లతో కొడతాం

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్! మెగా కింగ్ కాంబో?

Photos

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)