Breaking News

పాకిస్తాన్‌కు ఐసీసీ భారీ షాక్‌..

Published on Fri, 11/14/2025 - 09:54

రావల్పిండి వేదికగా శ్రీలంతో జరిగిన తొలి వన్డేలో గెలిచి జోష్‌ మీదున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ క్రికెట్ ‍కౌన్సిల్ భారీ షాకిచ్చింది.  స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్తాన్ జట్టుకు ఐసీసీ జరిమానా విధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక నిర్ణీత సమయంలో తమ కోటా 50 ఓవర్లు పూర్తి చేయలేకపోయింది (నాలుగు ఓవ‌ర్లు వెనుకపడింది).

ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌లో ఇది ఆర్టికల్‌ 2.22 ఉల్లంఘణ కిందికి వస్తుంది. ఈ క్ర‌మంలో పాక్ జ‌ట్టులో ప్ర‌తీ ఆట‌గాడి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. త‌మ త‌ప్పును మెన్ ఇన్ గ్రీన్ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది అంగీక‌రించాడు. దీంతో అతను తదుపరి విచారణ నుంచి మినహాయింపు పొందాడు.

నేడు రెండో వ‌న్డే..
ఇక పాక్‌-శ్రీలంక మ‌ధ్య రెండో వ‌న్డేను భ‌ద్ర‌తా కారణాల దృష్ట్యా రీ షెడ్యూల్ చేశారు. వాస్తవానికి గురువారం (నవంబర్ 13)న జరగాల్సిన రెండో వన్డే శుక్రవారం జరగనుంది. ఇటీవలే ఇస్లామాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడితో లంక క్రికెట‌ర్లు భయందోళ‌నకు గుర‌య్యారు. 

దీంతో తొలి వన్డే  తర్వాత లంక క్రికెటర్లలో సుమారు 8 మంది ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోతామని జట్టు మేనేజ్‌మెంట్‌ను కోరారు. కానీ శ్రీలంక క్రికెట్ మాత్రం అందుకు అంగీకరించలేదు. వన్డే సిరీస్‌తో పాటు ముక్కోణపు సిరీస్‌నూ ముగించుకున్నాకే స్వదేశానికి రావాలని వారిని ఆదేశించింది. దీంతో లంక ఆటగాళ్లు పాక్‌లోనే ఉండనున్నారు.
చదవండి: సెలక్టర్ల కీలక నిర్ణయం.. కెప్టెన్‌గా వరుణ్ చక్రవర్తి
 

Videos

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు