Breaking News

పాకిస్తాన్‌కు పరీక్ష

Published on Mon, 10/07/2024 - 04:10

 ముల్తాన్‌: స్వదేశంలో పాకిస్తాన్‌ జట్టు మరో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. ఇటీవల బంగ్లాదేశ్‌ చేతిలో వైట్‌వాష్‌కు గురైన పాకిస్తాన్‌ నేటి నుంచి ఇంగ్లండ్‌తో తలపడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సోమవారం నుంచి ముల్తాన్‌ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. రెగ్యులర్‌ కెప్టెన్ బెన్‌ స్టోక్స్‌ ఈ మ్యాచ్‌కు దూరం కాగా... అతడి స్థానంలో ఒలీ పోప్‌ ఇంగ్లండ్‌ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు. ఇటీవల శ్రీలంకపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు కూడా స్టోక్స్‌ అందుబాటులో లేకపోగా... పోప్‌ కెప్టెన్సీలో ఇంగ్లండ్‌ జట్టు సిరీస్‌ గెలుచుకుంది. 

రెండేళ్ల క్రితం పాకిస్తాన్‌లో పర్యటించిన ఇంగ్లండ్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. విపరీతమైన వేడి ఉండే ముల్తాన్‌లో స్పిన్నర్లకు సహకారం లభించే అవకాశం ఉండటంతో జాక్‌ లీచ్, షోయబ్‌ బషీర్‌ రూపంలో ఇద్దరు స్పిన్నర్లకు ఇంగ్లండ్‌ తుది జట్టులో చోటు కలి్పంచింది. పేస్‌ బౌలింగ్‌లో మాత్రం అనుభవరాహిత్యం కనిపిస్తోంది. పేస్‌ బౌలర్‌ బ్రైడన్‌ కార్స్‌ టెస్టు అరంగేట్రం చేయనుండగా.. అతడితో పాటు అట్కిన్‌సన్, వోక్స్, బ్రూక్‌ పేస్‌ విభాగాన్ని నడిపించనున్నారు.

మరోవైపు గత నాలుగేళ్లుగా స్వదేశంలో టెస్టు సిరీస్‌ గెలవలేకపోయిన పాకిస్తాన్‌ ఈసారి అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. టెస్టు కెపె్టన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ జట్టును గెలిపించలేకపోయిన పాక్‌ సారథి షాన్‌ మసూద్‌పై తీవ్ర ఒత్తిడి ఉంది. మాజీ కెప్టెన్  బాబర్‌ ఆజమ్‌తో పాటు వికెట్‌ కీపర్‌ రిజ్వాన్, అబ్దుల్లా షఫీఖ్, సౌద్‌ షకీల్, సల్మాన్‌ సమష్టిగా సత్తా చాటాలని పాకిస్తాన్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. బౌలింగ్‌లో షాహీన్‌ అఫ్రిది, నసీమ్‌ షా, కీలకం కానున్నారు. అబ్రార్, సల్మాన్‌ స్పిన్‌ బాధ్యతలు పంచుకోనున్నారు.  

Videos

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

Photos

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)