Breaking News

న్యూజిలాండ్‌పై పాకిస్తాన్‌ విజయం.. సెమీస్‌ రేసులో

Published on Sat, 11/04/2023 - 19:51

వన్డే ప్రపంచకప్‌-2023లో న్యూజిలాండ్‌కు పాకిస్తాన్‌ ఊహించని షాక్‌ తగిలింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో కివీస్‌పై 21 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం పాకిస్తాన్‌ గెలుపొందింది.

ఈ విజయంతో పాకిస్తాన్‌ తమ సెమీస్‌ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌  21. 3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 160/1 వద్ద ఆటకు వర్షం అంతరాయం కలిగించింది.

అయితే వర్షం తగ్గముఖం పట్టడంతో మ్యాచ్‌ను 41 ఓవర్లకు కుదించారు. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం  పాకిస్తాన్‌ టార్గెట్‌ను 342 పరుగులు కుదించారు. మ్యాచ్‌ తిరిగి ప్రారంభమయ్యే  సమయానికి పాకిస్తాన్‌కు 19. 3 ఓవర్లలో 182 పరుగులు అవసరమయ్యాయి. అయితే మ్యాచ్‌ ఆరంభమైన కొద్దిసేపిటికే మళ్లీ వరుణుడు రీ ఎంట్రీ ఇచ్చాడు.

రెండో సారి ఆట నిలిచిపోయే సమయానికి పాకిస్తాన్‌ 179 పరుగులు చేసింది. అప్పటికే న్యూజిలాండ్‌ డీఎల్‌ఎస్‌ ప్రకారం.. 21 పరుగుల ముందంజలో ఉంది. ఈ క్రమంలో వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో పాకిస్తాన్‌ను డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం విజేతగా నిర్ణయించారు.

జమాన్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌..
కాగా పాకిస్తాన్‌ విజయంలో ఆ జట్టు ఓపెనర్‌ ఫఖార్‌ జమాన్‌ కీలక పాత్ర పోషించాడు. జమాన్‌ అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. భారీ లక్ష్య ఛేదనలో కివీస్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 63 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 81 బంతుల్లో 8 ఫోర్లు ,11 సిక్స్‌లతో 126 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్‌ బాబర్‌ ఆజం(66 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.
చదవండి: WC 2023 NZ Vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్‌ ఓపెనర్‌.. వరల్డ్‌కప్‌ చరిత్రలోనే

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)