పాకిస్తాన్‌కు గుడ్‌బై.. అంతలోనే..

Published on Thu, 07/30/2026 - 13:11

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్లు, కోచ్‌ల విషయంలో నిలకడ ఉండదు. ఎప్పుటికప్పుడు సారథులు, మార్గ నిర్దేశకులు మారుతూనే ఉంటారు. ఇందులో భాగంగా ఇటీవలే టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి షాన్‌ మసూద్‌ను తప్పించిన పాక్‌ బోర్డు.. మళ్లీ బాబర్‌ ఆజంకే పగ్గాలు అప్పగించింది.

పాకిస్తాన్‌కు గుడ్‌బై
ఇక పాక్‌ జట్టు కోచింగ్‌ విభాగంలోనూ ఇటీవలే ఓ మార్పు చోటుచేసుకుంది. ఫీల్డింగ్‌ కోచ్‌గా పనిచేసిన షేన్‌ మెక్‌డెర్మాట్‌ ఇటీవలే ఆ జట్టుకు గుడ్‌బై చెప్పాడు. తాజాగా అతడు అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ సీనియర్‌ జట్టు అసిస్టెంట్‌, ఫీల్డింగ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని అఫ్గాన్‌ బోర్డు తాజాగా ప్రకటించింది.

ఆగష్టు 1 నుంచి ఐర్లాండ్‌తో మొదలయ్యే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ నుంచి మెక్‌డెర్మాట్‌ అఫ్గాన్‌ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. కాగా గతంలోనూ మెక్‌డెర్మాట్‌ అఫ్గాన్‌ కోచ్‌గా పనిచేశాడు. 2024 జనవరి నుంచి 2025 జూలై వరకు బాధ్యతలు నిర్వర్తించిన అతడు..ఆ తర్వాత పాక్‌ కోచ్‌గ వెళ్లాడు. 

అయితే, స్వల్ప కాలంలోనే పాక్‌ జట్టు కోచింగ్‌ బాధ్యతల నుంచి వైదొలిగాడు. గతంలో శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియా జట్లకు సహాయక కోచ్‌గానూ మెక్‌డెర్మాట్‌ పనిచేశాడు.

వాళ్లు సైతం...
ఇదిలా ఉంటే.. మెక్‌డెర్మాట్‌ కంటే ముందు గ్యారీ కిర్‌స్టన్‌, జేసన్‌ గిల్లెస్పి పాక్‌ హెడ్‌కోచ్‌ పదవుల నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు తాత్కాలిక కోచ్‌లను నియమించిన పాక్‌ బోర్డు.. ఆ తర్వాత మైక్‌ హసన్‌ను పూర్తిస్థాయి హెడ్‌కోచ్‌గా నియమించింది. 

అయితే, పీసీబీ చీఫ్‌ మొహ్సిన్‌ నక్వీ- మైక్‌ హసన్‌ మధ్య విభేదాలు మొదలయ్యాయని.. త్వరలోనే అతడూ పాక్‌ జట్టును వీడటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా పాక్‌ క్రికెట్‌ జట్టు ఇటు ఆటలోనూ.. అటు కోచింగ్‌ సభ్యుల విషయంలోనూ నిలకడ లేకుండా ఛిన్నాభిన్నం అవుతోందన్న చర్చ జరుగుతోంది. 

చదవండి: శుబ్‌మన్‌ గిల్‌ సంచలన నిర్ణయం!

Videos

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)