Breaking News

అదే మా కొంప ముంచింది.. బంగ్లా చేతిలో ఓటమిపై పాక్‌ కెప్టెన్‌ స్పందన

Published on Sun, 08/25/2024 - 20:47

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్‌ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇది తొలి టెస్ట్‌ విజయం. పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో మట్టికరపించిన తొలి జట్టుగా బంగ్లాదేశ్‌ రికార్డుల్లోకెక్కింది. 

పాక్‌ సొంతగడ్డపై టెస్ట్‌ మ్యాచ్‌ గెలిచి 1294 రోజులు అవుతుంది. 2021‌లో పాక్‌ చివరిగా సొంతగడ్డపై సౌతాఫ్రికాను ఓడించింది. పాక్‌ ఈ మ్యాచ్‌లో మరో పేలవ రికార్డు కూడా మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ఓటమిపాలవ్వడం పాక్‌కు ఇది నాలుగో సారి.

బంగ్లా చేతిలో ఊహించని పరాభవం అనంతరం ఆ జట్టు కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ స్పందించాడు.  స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను తీసుకోకపోవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని అంగీకరించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కాస్త ముందుగా డిక్లేర్ చేయడం ఓటమిపై కొంతమేర ప్రభావం చూపించిందని అన్నాడు. మ్యాచ్‌ను వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసకున్నామని తెలిపాడు. 

ఊహించనట్లుగా పిచ్‌ నుంచి సహకారం లభించలేదని పేర్కొన్నాడు. నలుగురు పేసర్లతో బరిలోకి దిగడం పేలవ వ్యూహమని అన్నాడు. మా ఓటమికి బ్యాటింగ్ వైఫల్యం కారణం కాదని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటామని వెల్లడించాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బంగ్లాదేశ్‌ 565 పరుగులు చేసి ఆలౌటైంది.

సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్‌ 146 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. వికెట్‌ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇది తొలి టెస్ట్‌ విజయం. 

పాక్‌ను వారి సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో మట్టికరపించిన తొలి జట్టు కూడా బంగ్లాదేశే కావడ​ం విశేషం. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో బంగ్లాదేశ్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్‌ ఆగస్ట్‌ 30న ఇదే వేదికగా జరుగనుంది.

స్కోర్‌ వివరాలు..

పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌ 448/6 (సౌద్‌ షకీల్‌ 141, మొహమ్మద్‌ రిజ్వాన్‌ 171 నాటౌట్‌, హసన్‌ మహమూద్‌ 2/70)

బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ 565 (ముష్ఫికర్‌ అహ్మద్‌ 191, షడ్మాన్‌ ఇస్లాం 93, నసీం షా 3/93)

పాకిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌ 146 (మొహమ్మద్‌ రిజ్వాన్‌ 51, మెహిది హసన్‌ 4/21)

బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌ 30/0 (జకీర్‌ హసన్‌ 15 నాటౌట్‌)



 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)