Breaking News

CWG 2026: పాకిస్థాన్‌ బాక్సర్‌ మిస్సింగ్‌

Published on Tue, 08/04/2026 - 18:36

కామన్వెల్త్ గేమ్స్‌ 2026 తర్వాత పాకిస్థాన్‌ బాక్సర్‌ కుద్రతుల్లా (Qudratullah) మిస్‌ అయినట్లు తెలుస్తోంది. పోటీలు ముగిసిన అనంతరం టీమ్‌ హోటల్‌ నుంచి వెళ్లిన అతడు అదృశ్యమైనట్లు సమాచారం. అతని పాస్‌పోర్ట్‌  కూడా టీమ్‌ మేనేజర్‌ వద్దే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదే తొలిసారి కాదు
అంతర్జాతీయ టోర్నీల సమయంలో పాకిస్థాన్‌ బాక్సర్లు అదృశ్యమైన ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌ సందర్భంగా సులేమాన్‌ బలోచ్‌, నజీరుల్లా ఖాన్‌ బర్మింగ్‌హామ్‌లో అదృశ్యమయ్యారు. అప్పట్లోనూ వారి పాస్‌పోర్టులు మేనేజర్‌ వద్దే ఉన్నట్లు సమాచారం.

2024లో ఇటలీలో జరిగిన వరల్డ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ సందర్భంగా ఆసియా గోల్డ్‌ మెడలిస్ట్‌ బాక్సర్‌ జోహైబ్‌ రషీద్‌ (పాక్‌) తన రూమ్‌మేట్‌కు చెందిన విదేశీ కరెన్సీ, విలువైన వస్తువులను తీసుకుని బస్టో అర్సిజియో పట్టణంలో అదృశ్యమైనట్లు ఆరోపణలు వచ్చాయి.

ఒక్క పతకంతో సరిపెట్టుకున్న పాక్‌
కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026లో పాక్‌కు ఒకే ఒక పతకం లభించింది. ఈ పోటీల్లో మొత్తం 36 మంది సభ్యులు పాల్గొనగా..మహిళల బాక్సింగ్‌లో ఫాతిమా జెహ్రా కాంస్య పతకాన్ని సాధించింది.

 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)