న్యూజిలాండ్‌కు బిగ్‌ షాకిచ్చిన పాకిస్తాన్‌.. 88 పరుగులకే ఆలౌట్‌

Published on Sat, 04/15/2023 - 08:03

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌ శుభారంభం చేసింది. లాహొర్‌ వేదికగా కివీస్‌తో జరిగిన తొలి టీ20లో 88 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ ఘన విజయం సాధించింది. 183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌.. పాక్‌ పేసర్ల ధాటికి 94 పరుగులకే కుప్పకూలింది. పాక్‌ బౌలర్లలో హారిస్‌ రౌఫ్‌ నాలుగు వికెట్లతో కివీస్‌ వెన్ను విరచగా.. ఇమాడ్‌ వసీం రెండు, అఫ్రిది, షాదాబ్‌ ఖాన్‌, జమాన్‌ ఖాన్‌, ఆష్రాఫ్‌ తలా వికెట్‌ సాధించారు.

న్యూజిలాండ్‌ బ్యాటర్లలో మార్క్‌ చాప్‌మాన్‌(34) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ 182 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ బ్యాటర్లలో అయాబ్‌(47), ఫఖర్ జమాన్(47) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో మాట్‌ హెన్రీ హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టాడు.

అతడితో పాటు మిల్నే, లిస్టర్‌ తలా రెండు వికెట్లు, సోధి, లిస్టర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. కాగా పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంకు  ఇది 100 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ కావడం విశేషం. ఇక ఈ రెండు జట్ల రెండో టీ20 లాహొర్‌ వేదికగానే శనివారం జరగనుంది.
చదవండి: IPL 2023: ఈ చెత్త ఆటకే వాళ్లు వదిలేసింది.. ఇక్కడ కూడా అంతేనా? 8 కోట్లు దండగ

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)