Breaking News

AUS Vs PAK: ఏడేళ్ల తర్వాత పాక్‌ సాధించింది..!

Published on Fri, 11/08/2024 - 15:43

ఆసీస్‌ గడ్డపై పాక్‌ ఏడేళ్ల తర్వాత తొలిసారి ఓ వన్డేలో విజయం సాధించింది. జనవరి 15, 2017లో పాక్‌ చివరిసారి ఆసీస్‌ను వారి సొంతగడ్డపై (మెల్‌బోర్న్‌) ఓ వన్డేలో ఓడించింది. 2854 రోజుల తర్వాత పాక్‌ తిరిగి ఆసీస్‌ను వారి సొంతగడ్డపై ఓడించింది. అడిలైడ్‌ వేదికగా ఇవాళ (నవంబర్‌ 8) జరిగిన మ్యాచ్‌లో పాక్‌ ఆసీస్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 

ఈ మ్యాచ్‌లో పాక్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో అద్భుతంగా రాణించి ఏకపక్ష విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో హరీస్‌ రౌఫ్‌ (8-0-29-5).. ఆతర్వాత బ్యాటింగ్‌లో సైమ్‌ అయూబ్‌ (71 బంతుల్లో 82; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగిపోయారు. వీరికి తోడు మొహమ్మద్‌ రిజ్వాన్‌ వికెట్‌కీపింగ్‌లో చెలరేగాడు. రిజ్వాన్‌ ఈ మ్యాచ్‌లో ఏకంగా ఆరు క్యాచ్‌లు పట్టాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో పాక్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో నవంబర్‌ 10న పెర్త్‌ వేదికగా జరుగనుంది.  

మ్యాచ్‌ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా హరీస్‌ రౌఫ్‌ (5/29), షాహీన్‌ అఫ్రిది (3/26), నసీం షా (1/65), మొహమ్మద్‌ హస్నైన్‌ (1/27) ధాటికి 35 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌ (35) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

అనంతరం 164 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదిం‍చేందుకు బరిలోకి దిగిన పాక్‌.. 26.3 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి విజతీయాలకు చేరింది. ఓపెనర్లు సైమ్‌ అయూబ్‌, అబ్దుల్లా షఫీక్‌ బాధ్యతాయుతమైన అర్ద  సెంచరీలతో (69 బంతుల్లో 64 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అలరించారు. ఆసీస్‌ బౌలర్లలో ఆడమ్‌ జంపాకు ఓ వికెట్‌ దక్కింది. 
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)