Breaking News

పాకిస్తాన్ జట్టు ప్రకటన.. ముగ్గురు 'మొనగాళ్ల'కు పిలుపు

Published on Sat, 10/24/2026 - 21:00

శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం నాయకత్వం వహించనున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టుకు దూరమైన ఆల్‌రౌండర్  సల్మాన్ అలీ ఆఘా తిరిగి జట్టులోకి వచ్చాడు.

ప్రస్తుతం సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ట్రై-సిరీస్‌లో సల్మాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో అతడు 90 బంతుల్లోనే 107 పరుగులు సాధించి మంచి ఊపులో ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడిని తిరిగి జట్టులోకి తీసుకున్నారు.

కొత్త ఆటగాళ్లకు పిలుపు
కాగా ముగ్గురు యువ బ్యాటర్లకు తొలిసారిగా జాతీయ జట్టులో చోటు దక్కింది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ మహ్మద్ తహా, రైట్ హ్యాండ్ బ్యాటర్లు సమీర్ మన్హాస్, మహ్మద్ సులేమాన్‌లను లంకతో సిరీస్‌కు ఎంపిక చేశారు. అబ్దుల్లా ఫజల్, అరాఫత్ మిన్హాస్,  అవైస్, మహ్మద్ అబ్బాస్, రజాఉల్లా, సాద్ బైగ్, సౌద్ షకీల్ తదితరులు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

వికెట్ కీపర్లుగా మహ్మద్ గాజీ ఘోరి, సాద్ బైగ్ ఎంపికవగా.. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అలీ ఉస్మాన్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. మరోసారి సీనియర్ ప్లేయర్ షాహీన్ షా అఫ్రిదికి టెస్టు జట్టులో చోటు దక్కలేదు. అదేవిధంగా మాజీ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌, ఇమామ్ ఉల్ హక్‌ను సైతం పక్కన పెట్టారు. నవంబర్ 9 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.

శ్రీలంకతో సిరీస్‌కు పాక్ జట్టు ఇదే
బాబర్ ఆజమ్ (కెప్టెన్), అబ్దుల్లా ఫజల్, అలీ ఉస్మాన్, అరాఫత్ మిన్హాస్, అజాన్ అవైస్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ గాజీ ఘోరి (వికెట్ కీపర్), మహ్మద్ సులేమాన్, మహ్మద్ తహా, రజాఉల్లా, సాద్ బైగ్ (వికెట్ కీపర్), సల్మాన్ అలీ ఆఘా, సమీర్ మన్హాస్, సౌద్ షకీల్.
చదవండి: వారిద్దరూ అద్భుతం.. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించారు: శ్రేయస్‌ అయ్యర్‌

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)