Breaking News

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. తుది జట్టును ప్రకటించిన పాకిస్తాన్‌

Published on Thu, 12/26/2024 - 11:20

దక్షిణాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన పాకిస్తాన్‌.. ఇప్పుడు అదే జ‌ట్టుతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో త‌ల‌పడేందుకు సిద్ద‌మైంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జ‌ట్ల మ‌ధ్య తొలి టెస్టు సెంచూరియన్ వేదిక‌గా గురువారం నుంచి మొద‌లు కానుంది.

ఈ క్ర‌మంలో బాక్సింగ్ డే టెస్టు(క్రిస్ట్‌మ‌స్ త‌ర్వాతి రోజు జ‌రిగే మ్యాచ్‌) కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తమ తుది జట్టును ప్రకటించింది.  మాజీ కెప్టెన్ బాబర్ ఆజం తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. అక్టోబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో బాబర్ చివరిసారిగా పాక్ తరపున ఆడాడు.

ఆ తర్వాత  సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టులకు పీసీబీ బాబర్‌ను పక్కన పెట్టింది. ఇప్పుడు మరోసారి అతడికి పాక్ క్రికెట్ బోర్డు అవకాశమిచ్చింది. మరోవైపు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో హ్యాట్రిక్ డకౌట్లు నమోదు చేసిన అబ్దుల్లా షఫీక్‌పై పీసీబీ వేటు వేసింది.

అతడి స్దానంలోనే బాబర్‌కు చోటు దక్కింది. ఈ మ్యాచ్‌లో నలుగురు పేసర్లతో పాక్ బరిలోకి దిగుతోంది. కాగా ఈ మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికా ఇప్పటికే తమ ప్లేయింగ్  ఎలెవన్‌ను ప్రకటించింది. కాగా ఈ సిరీస్‌ వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 సైకిల్‌లో భాగంగా జరుగుతోంది.

తుది జట్లు
పాకిస్థాన్: షాన్ మసూద్ (కెప్టెన్‌), సయీమ్ అయూబ్, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, ముహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్‌), సౌద్ షకీల్, సల్మాన్ అలీ అఘా, అమీర్ జమాల్, నసీమ్ షా, ఖుర్రం షాజాద్, ముహమ్మద్ అబ్బాస్.

దక్షిణాఫ్రికా: టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్‌రామ్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, టెంబా బావుమా (కెప్టెన్‌), డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రేన్నే (వికెట్ కీపర్‌), మార్కో జాన్సెన్, కగిసో రబడా, డేన్ ప్యాటర్సన్, కార్బిన్ బాష్
చదవండి: IND Vs AUS 4th Test: చరిత్ర సృష్టించిన ఆసీస్‌ యువ ఓపెనర్‌.. 95 ఏళ్ల రికార్డు బద్దలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)