Breaking News

సిరీస్‌ నీదా నాదా!

Published on Thu, 10/24/2024 - 03:53

రావల్పిండి: పాకిస్తాన్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య నేటి నుంచి నిర్ణయాత్మక మూడో టెస్టు ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు చెరో మ్యాచ్‌ నెగ్గగా... గురువారం నుంచి రావల్పిండిలో మూడో టెస్టు మొదలవుతుంది. పరుగుల వరద పారిన తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ తేడాతో ఘనవిజయం సాధించిన ఇంగ్లండ్‌ జట్టు... స్పిన్‌కు అనుకూలించిన రెండో టెస్టులో పరాజయం పాలైంది. దీంతో మూడో టెస్టు కోసం పాకిస్తాన్‌ జట్టు మరోసారి స్పిన్‌ పిచ్‌నే సిద్ధం చేసింది. 

స్లో బౌలర్లకు సహకరించే విధంగా పొడి వికెట్‌ను తయారు చేసిన పాకిస్తాన్‌ గత నాలుగు రోజులుగా పిచ్‌ను ఆరబెట్టేందుకు ప్రత్యేకంగా భారీ ఫ్యాన్‌లు ఏర్పాటు చేసింది. రెండో టెస్టులో పాకిస్తాన్‌ స్పిన్నర్లు నోమాన్‌ అలీ, సాజిద్‌ ఖాన్‌ ఇద్దరే చెలరేగి ఇంగ్లండ్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆలౌట్‌ చేసి 20 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్న నేపథ్యంలో... మరోసారి స్పిన్‌ బలంతోనే పాకిస్తాన్‌ ఫలితం రాబట్టాలని చూస్తోంది. 

తొలి రోజు నుంచే బంతి గింగిరాలు తిరిగే అవకాశం ఉండటంతో మరోసారి టాస్‌ కీలకం కానుంది. సీనియర్‌ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి... వారి స్థానంలో ఇతర ప్లేయర్లకు అవకాశం ఇచ్చిన తర్వాతే పాకిస్తాన్‌ రాత మారింది. అరంగేట్ర టెస్టులోనే సెంచరీతో ఆకట్టుకున్న కమ్రాన్‌ గులామ్‌పై అంచనాలు పెరిగిపోగా..కెప్టెన్ షాన్‌ మసూద్, అబ్దుల్లా షఫీఖ్, సౌద్‌ షకీల్, రిజ్వాన్‌ కలిసి కట్టుగా కదం తొక్కాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. 

మరోవైపు ఇంగ్లండ్‌ అదనపు స్పిన్నర్‌గా లెగ్‌స్పిన్నర్‌ రేహాన్‌ అహ్మద్‌ను బరిలోకి దించనుంది. తొలి టెస్టులో ట్రిపుల్‌ సెంచరీతో చెలరేగిన హ్యారీ బ్రూక్‌తో పాటు జో రూట్, ఓలీ పోప్, బెన్‌ డకెట్, జాక్‌ క్రాలీ, బెన్‌ స్టోక్స్, జేమీ స్మిత్‌తో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)