Breaking News

PAK Vs SA: రాణించిన బాబర్‌, అఫ్రిది.. పాకిస్తాన్‌దే టీ20 సిరీస్‌

Published on Sun, 11/02/2025 - 13:50

స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పాకిస్తాన్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. లాహోర్‌ వేదికగా నిన్న (నవంబర్‌ 1) జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో పాక్‌ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేయగా.. పాక్‌ మరో ఓవర్‌ మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

చెలరేగిన షాహీన్‌
రీజా హెండ్రిక్స్‌ (34), కార్బిన్‌ బాష్‌ (30 నాటౌట్‌), డొనొవన్‌ ఫెరియెరా (29), డెవాల్డ్‌  బ్రెవిస్‌ (21) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో సౌతాఫ్రికా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. డికాక్‌, ప్రిటోరియస్‌. జార్జ్‌ లిండే డకౌట్లయ్యారు. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిది (4-0-26-3), ఫహీమ్‌ అష్రాఫ్‌ (4-0-28-2), సల్మాన్‌ మీర్జా (4-0-16-1), ఉస్మాన్‌ తారిఖ్‌ (4-0-26-2), మొహమ్మద్‌ నవాజ్‌ (3-0-38-1) చెలరేగిపోయారు.

రాణించిన బాబర్‌
చాలాకాలం తర్వాత బాబర్‌ ఆజమ్‌ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో 47 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 68 పరుగులు చేశాడు. సల్మాన్‌ అఘా (33) ఓ మోస్తరుతో పర్వాలేదనిపించాడు. 

మిగతా బ్యాటర్లలో సాహిబ్‌జాదా ఫర్హాన్‌ 19, సైమ్‌ అయూబ్‌ డకౌట్‌, ఉస్మాన్‌ ఖాన్‌ 6 (నాటౌట్‌), హసన్‌ నవాజ్‌ 5, మొహమ్మద్‌ నవాజ్‌ డకౌట్‌, ఫహీమ్‌ అష్రాఫ్‌ 4 (నాటౌట్‌) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్‌ బాష్‌, లిజాడ్‌ విలియమ్స్‌ తలో 2, డొనొవన్‌ ఫెరియెరా, సైమ్‌లేన్‌ చెరో వికెట్‌ తీశారు. 

చదవండి: బాబర్‌ ఆజం ప్రపంచ రికార్డు.. మొన్న రోహిత్‌.. ఇప్పుడు కోహ్లి రికార్డు బద్దలు


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)