Breaking News

ఒకే ఇన్నింగ్స్‌తో రెండు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన బాబర్‌ ఆజమ్‌

Published on Fri, 05/05/2023 - 20:43

PAK VS NZ 4th ODI: కరాచీ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (మే 5) జరుగుతున్న నాలుగో వన్డేలో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన బాబర్‌ (117 బంతుల్లో 107; 10 ఫోర్లు).. వన్డేల్లో అత్యంత వేగంగా 18 సెంచరీలు (97 ఇన్నింగ్స్‌ల్లో) చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ రికార్డు దిగ్గజ సౌతాఫ్రికా బ్యాటర్‌ హషీమ్‌ ఆమ్లా పేరిట ఉండేది. ఆమ్లాకు 18 సెంచరీలు సాధించేందుకు 102 ఇన్నింగ్స్‌లు ఆవసరమయ్యాయి. అంతకుముందు ఇదే మ్యాచ్‌లో బాబర్‌ మరో ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పాడు.  

వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 19 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద బాబర్‌ ఈ మైలురాయిని అధిగమించాడు. బాబర్‌ 97 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. గతంలో వేగవంతమైన 5000 పరుగుల రికార్డు సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్‌ హషీమ్‌ ఆమ్లా పేరిట ఉండేది. ఆమ్లాకు ఈ మైలురాయిని అందుకునేందుకు 101 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.

ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌.. బాబర్‌ (117 బంతుల్లో 107; 10 ఫోర్లు) సెంచరీతో కదం తొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 334 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. షాన్‌ మసూద్‌ (44), అఘా సల్మాన్‌ (58) రాణించగా.. ఆఖర్లో షాహీన్ అఫ్రిది (7 బంతుల్లో 23 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 3, బెన్‌ లిస్టర్‌, ఇష్‌ సోధి తలో వికెట్‌ పడగొట్టారు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)