Breaking News

సౌద్‌ షకీల్‌ శతకం.. కివీస్‌కు ధీటుగా బదులిస్తున్న పాక్‌

Published on Wed, 01/04/2023 - 19:01

PAK VS NZ 2nd Test 3rd Day: కరాచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పాకిస్తాన్‌ ధీటుగా బదులిస్తుంది. సౌద్‌ షకీల్‌ (336 బంతుల్లో 124 నాటౌట్‌; 17 ఫోర్లు) టెస్ట్‌ల్లో తన తొలి శతకంతో రెచ్చిపోవడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిధ్య జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 407 పరుగులు చేసింది.

షకీల్‌కు జతగా ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (83), వికెట్‌ కీపర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ (78) అర్ధసెంచరీలతో రాణించగా.. ఆఘా సల్మాన్‌ (41) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో అజాజ్‌ పటేల్‌ 3 వికెట్లు పడగొట్టగా.. ఇష్‌ సోధీ 2, టిమ్‌ సౌథీ, మ్యాట్‌ హెన్రీ, డారిల్‌ మిచెల్‌ తలో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. 

అంతకుముందు న్యూజిలాండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 449 పరుగులకు ఆలౌటైంది. డెవాన్‌ కాన్వే (122) సెంచరీతో చెలరేగగా.. టామ్‌ లాథమ్‌ (71), టామ్‌ బ్లండల్‌ (51), మ్యాట్‌ హెన్రీ (68) అర్ధశతకాలతో రాణించారు. పాక్‌ బౌలర్లలో అబ్రార్‌ అహ్మద్‌ 4 వికెట్లతో  సత్తా చాటగా.. నసీమ్‌ షా, అఘా సల్మాన్‌ 3 వికెట్లతో రాణించారు.

కాగా, సప్పగా సాగుతున్న ఈ రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. దీనికి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ కోసం బౌలర్లకు అనుకూలమైన పిచ్‌లు తయారు చేశారని విమర్శలు ఎదుర్కొన్న పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు.. వరుస పరాభవాలను తప్పించుకునేందుకు ఈ సిరీస్‌ కోసం నిర్జీవమైన పిచ్‌లు తయారు చేసింది. ఇంగ్లండ్‌ చేతిలో పాక్‌ 0-3 తేడాతో వైట్‌వాష్‌ అయిన విషయం తెలిసిందే.      

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి