Breaking News

PAK VS ENG 2nd Test: 52 ఏళ్లలో తొలిసారి ఇలా..!

Published on Fri, 10/18/2024 - 14:43

ముల్తాన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 152 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పాక్‌ స్పిన్నర్లు చెలరేగిపోయారు. నౌమన్‌ అలీ 11, సాజిద్‌ ఖాన్‌ 9 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ పతనాన్ని శాశించారు. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్ధికి చెందిన 20 వికెట్లు ఈ ఇద్దరు స్పిన్నర్లే తీయడం విశేషం. 

52 ఏళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. సాజిద్‌ ఖాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీయగా.. నౌమన్‌ అలీ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో మూడు, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. పాక్‌ సొంతగడ్డపై 11 మ్యాచ్‌ల తర్వాత తొలి విజయం సాధించింది. కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ డబుల్‌ హ్యాట్రిక్‌ పరాజయాల తర్వాత తొలి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. పాక్‌ సొంతగడ్డపై 1349 రోజుల తర్వాత తొలి టెస్ట్‌ విజయాన్ని నమోదు చేసింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం బ్యాటర్‌ కమ్రాన్‌ గులామ్‌ సెంచరీతో (118) కదంతొక్కగా.. సైమ్‌ అయూబ్‌ అర్ద సెంచరీతో (77) రాణించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జాక్‌ లీచ్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. బ్రైడన్‌ కార్స్‌ మూడు, మాథ్యూ పాట్స్‌ రెండు, షోయబ్‌ బషీర్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ 291 పరుగులకు ఆలౌటైంది. బెన్‌ డకెట్‌ సెంచరీతో (114) సత్తా చాటగా.. మిగతా ఆటగాళ్లెవ్వరూ కనీసం చెప్పుకోదగ్గ స్కోర్లు కూడా చేయలేకపోయారు. పాక్‌ బౌలర్లలో సాజిద్‌ ఖాన్‌ ఏడు, నౌమన్‌ అలీ మూడు వికెట్లు పడగొట్టారు.

75 పరుగుల ఆధిక్యంతో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాక్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 221 పరుగులకు ఆలౌటైంది. అఘా సల్మాన్‌ అర్ద సెంచరీతో (63) రాణించాడు. ఇంగ్లీష్‌ బౌలర్లలో షోయబ్‌ బషీర్‌ 4, జాక్‌ లీచ్‌ 3, బ్రైడన్‌ కార్స్‌ 2, మాథ్యూ పాట్స్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

297 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను నౌమన్‌ అలీ (8/46), సాజిద్‌ ఖాన్‌ (2/93) 144 పరుగులకే కుప్పకూల్చారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో బెన్‌ స్టోక్స్‌ టాప్‌ స్కోరర్‌గా (37) నిలిచాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ తొలి టెస్ట్‌ గెలిచిన విషయం తెలిసిందే.

చదవండి: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన పాకిస్తాన్‌..

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)