తొలి వన్డేలో 59 పరుగులకే చిత్తు.. రెండో వన్డేలో 227/0.. ఇంతలో ఎంత మార్పు..!

Published on Thu, 08/24/2023 - 18:29

ఆఫ్ఘనిస్తాన్‌ జట్టులో కేవలం గంటల వ్యవధిలో భారీ మార్పు వచ్చింది. మొన్న (ఆగస్ట్‌ 24) హంబన్‌తోటలో పాకిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో 59 పరుగులకే చిత్తై, చెత్త రికార్డులు మూటగట్టుకున్న ఆఫ్ఘన్లు.. ఇవాళ (ఆగస్ట్‌ 24) అదే పాకిస్తాన్‌తో అదే హంబన్‌తోటలో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతూ పలు అరుదైన రికార్డులు తమ ఖాతాలో వేసుకున్నారు.

ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఓపెనర్లు రహ్మానుల్లా గుర్భాజ్‌ (135), ఇబ్రహీమ్‌ జద్రాన్‌ (80) తొలి వికెట్‌కు ఏకంగా 227 పరుగులు జోడించి పలు రికార్డులు సొంతం చేసుకున్నారు. పాక్‌పై 100 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తొలి ఆఫ్ఘనిస్తాన్‌ ఓపెనింగ్‌ జోడీగా.. అలాగే ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున వన్డేల్లో రెండు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీగా.. 2010 తర్వాత పాక్‌పై అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం (227) నమోదు చేసిన రెండో జోడీగా పలు రికార్డులు మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రహ్మానుల్లా గుర్భాజ్‌.. పాకిస్తాన్‌పై వన్డే సెంచరీ చేసిన తొలి ఆప్ఘన్‌ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.  

తొలి వికెట్‌కు 227 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించిన అనంతరం ఉసామా మిర్‌ బౌలింగ్‌లో ఇఫ్తికార్‌ అహ్మద్‌కు క్యాచ్‌ ఇచ్చి జద్రాన్‌ (80) ఔట్‌ కావడంతో ఆఫ్ఘనిస్తాన్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 43 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్‌ నష్టానికి 247 పరుగులు చేసింది. గుర్భాజ్‌ (147), మహ్మద్‌ నబీ (7) క్రీజ్‌లో ఉన్నారు.  

తేలిపోయిన పాక్‌ పేసర్లు..
తొలి వన్డేలో ఆఫ్ఘన్‌ ప్లేయర్‌ పాలిట సింహస్వప్నల్లా ఉండిన పాక్‌ పేసర్లు ఈ మ్యాచ్‌లో తేలిపోయారు. తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల ప్రదర్శనతో నిప్పులు చెరిగిన హరీస్‌ రౌఫ్‌ ఈ మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. షాహీన్‌ అఫ్రిది, నసీం షా సైతం అతన్ని ఫాలో అయ్యారు. ఈ మ్యాచ్‌లో ఈ పేస్‌ త్రయం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)