Breaking News

నిప్పులు చెరిగిన హరీస్‌ రౌఫ్‌.. 59 పరుగులకే కుప్పకూలిన ఆఫ్ఘనిస్తాన్‌

Published on Tue, 08/22/2023 - 21:29

3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా హంబన్‌తోట (శ్రీలంక) వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (ఆగస్ట్‌ 22) జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్‌ పేసర్‌ హరీస్‌ రౌఫ్‌ నిప్పులు చెరిగాడు. 6.2 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో రౌఫ్‌కు ఇది తొలి ఫైఫర్‌ కావడం విశేషం. రౌఫ్‌ భీకర స్పెల్‌కు షాహీన్‌ అఫ్రిది (4-2-9-2), నసీం షా (5-0-12-1), షాదాబ్‌ ఖాన్‌ (1-1-0-1) తోడవ్వడంతో పాక్‌.. ఆఫ్ఘనిస్తాన్‌ను 59 పరుగులకే కుప్పకూల్చింది. ఫలితంగా ఆ జట్టు ఆఫ్ఘన్‌పై 142 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

పాక్‌ పేసర్ల ధాటికి ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. ఏకంగా నలుగురు ఆటగాళ్లు డకౌట్లయ్యారు. ఓపెనర్‌ రహానుల్లా గుర్భాజ్‌ చేసిన 18 పరుగులే ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోర్‌గా నిలిచింది. ఒమర్‌జాయ్‌ 16 పరుగులు చేసి రిటైర్డ్‌ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. 

అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (61), షాదాబ్‌ ఖాన్‌ (39), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (30), మహ్మద్‌ రిజ్వాన్‌ (21), నసీం షా (18 నాటౌట్‌) మినహా ఎవ్వరూ రెండంకెల స్కోర్లు కూడా చేయలేకపోవడంతో 47.1 ఓవర్లలో 201 పరుగులు చేసి ఆలౌటైంది. ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ (10-1-33-3), రషీద్‌ ఖాన్‌ (10-0-42-2), మహ్మద్‌ నబీ (10-0-34-2), రెహ్మత్‌ షా (1.1-0-6-1), ఫజల్‌ హక్‌ ఫారూకీ (8-0-51-1) ధాటికి పాక్‌ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)