Breaking News

క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా

Published on Mon, 03/27/2023 - 10:25

అంతర్జాతీయ టీ20ల్లో పాకిస్తాన్‌ క్రికెటర్‌ అబ్దుల్లా షఫీక్ అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. వరుసగా నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో డకౌటైన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఆదివారం ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో గోల్డన్‌ డకౌటైన షఫీక్ ఈ ప్రతిష్టతను మూటకట్టుకున్నాడు. అంతకుముందు ఆఫ్గాన్‌తో తొలి టీ20లోనూ డకౌట్‌గా వెనుదిరగాడు.

అదే విధంగా ఆఫ్గాన్‌తో సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌తో ఆడిన రెండు టీ20ల్లోనూ షఫీక్ డకౌటయ్యాడు. దీంతో ఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కాగా తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు ఐదు టీ20లు ఆడిన షఫీక్‌.. అందులో నాలుగు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో కలిపి షఫీక్‌ కేవలం 7 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు.

కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. పాకిస్తాన్‌పై ఆఫ్గానిస్తాన్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఆఫ్గానిస్తాన్‌ సొంతం చేసుకుంది. అదే విధంగా పాకిస్తాన్‌పై ఆఫ్గానిస్తాన్‌కు ఇదే తొలి టీ20 సిరీస్‌ విజయం.
చదవండి: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్‌ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్‌.. రాహుల్‌కు షాక్‌.. భరత్‌కు చోటు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)