Breaking News

సంచలన ప్రదర్శన.. గర్జించిన సికందర్‌ రజా

Published on Wed, 01/14/2026 - 08:32

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2025-26లో నిన్న (జనవరి 13) ఓ రసవతర్త సమరం జరిగింది. పార్ల్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌, జింబాబ్వే టీ20 జట్టు కెప్టెన్‌ సికందర్‌ రజా చివరి బంతికి సిక్సర్‌ బాది తన జట్టును గెలిపించాడు. 2 పరుగులు అవసరమైన తరుణంలో రజా ఊహించని విధంగా బౌలర్‌ డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ బౌలర్‌ డేవిడ్‌ వీస్‌పై ఎదురుదాడి చేశాడు. 

డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా ఫ్లాట్‌ సిక్సర్‌ బాదాడు. అనంతరం సింహగర్జన చేస్తూ విజయోత్సవ సంబరాలు చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఉన్న రూబిన్‌ హెర్మన్‌ను హత్తుకొని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. హెర్మన్‌ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడి రాయల్స్‌ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

వాస్తవానికి చివరి ఓవర్‌కు ముందు రాయల్స్‌ గెలుపుకు కేవలం 6 పరుగులు మాత్రమే కావాలి. అయితే వీస్‌ అద్భుతమైన బౌలింగ్‌తో రాయల్స్‌ గెలుపును చివరి బంతి వరకు అడ్డుకున్నాడు. వీస్‌ తొలి 5 బంతుల్లో కేవలం​ 4 పరుగులు మాత్రమే ఇచ్చి రాయల్స్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఓ దశలో వీస్‌ రాయల్స్‌ గెలుపును అడ్డుకునేలా కనిపించాడు. 

అయితే రజా సంచలన ప్రదర్శనతో రాయల్స్‌కు అపురూపమైన విజయాన్నందించాడు. ఈ గెలుపుతో రాయల్స్‌ పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. టాప్‌ ప్లేస్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ ఉంది. జోబర్గ్‌ సూపర్‌ కింగ్స​, డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌, ఎంఐ కేప్‌టౌన్‌ నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి.

స్కోర్‌ను పరిశీలిస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌.. కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ (66), లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (32 నాటౌట్‌) రాణించడంతో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. రాయల్స్‌ బౌలర్లలో ముజీబ్‌ 2 వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్‌ చేసి సత్తా చాటాడు.

అనంతరం డాన్‌ లారెన్స్‌ (63), రూబిన్‌ హెర్మన్‌ (65 నాటౌట్‌) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలు చేసి, రాయల్స్‌ గెలుపుకు దోహదపడ్డారు. ఆఖర్లో సికందర్‌ రజా (27 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)