Breaking News

సన్‌రైజర్స్ శుభారంభం..

Published on Sun, 12/28/2025 - 10:21

దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (SA20) 2025-26 సీజన్‌ను సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఘనంగా ఆరంభించింది. ఈ టోర్నీలో భాగంగా శనివారం బోలాండ్ పార్క్ వేదికగా పార్ల్ రాయల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 137 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పార్ల్ రాయల్స్‌.. 11.5 ఓవర్లలో కేవలం 42 పరుగులకే కుప్పకూలింది.

సన్‌రైజర్స్ బౌలర్ల దాటి​కి పార్ల్ బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కుప్పకూలింది. ఒక్కరంటే ఒక్కరు పట్టుమని పది నిమిషాల కూడా క్రీజులో నిలవలేకపోయారు. మొత్తం తొమ్మిది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. కెప్టెన్‌ మిల్లర్‌(7) కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. సన్‌రైజర్స్ స్పీడ్ స్టార్ అన్రిచ్ నోర్జే 4 వికెట్లు ప‌డ‌గొట్టి ప్ర‌త్య‌ర్ధి ప‌త‌నాన్ని శాసించాడు. అత‌డితో పాటు ఆడ‌మ్ మిల్నే, తరిందు రత్నాయకే త‌లా రెండు వికెట్లు సాధించారు.

హెర్మ‌న్ హాఫ్ సెంచ‌రీ..
అంత‌కుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. జోర్డాన్ హెర్మ‌న్‌(5 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 62) టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా.. క్వింట‌న్ డికాక్‌(42) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు.

పార్ల్ రాయ‌ల్స్ చెత్త రికార్డు..
ఈ మ్యాచ్‌లో 49 పరుగులకే ఆలౌటైన పార్ల్ రాయల్స్ అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. సౌతాఫ్రికా టీ20 లీగ్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా రాయల్స్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు ప్రిటోరియా క్యాపిటల్స్‌(52) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ప్రిటోరియాను రాయల్స్ అధిగమించింది.
చదవండి: వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులో హైద‌రాబాద్ కుర్రాడు.. ఎవరీ ఆరోన్ జార్జ్‌?

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)