హండ్రెడ్‌ లీగ్‌ విజేత ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌

Published on Mon, 08/19/2024 - 08:53

పురుషుల హండ్రెడ్‌ లీగ్‌ విజేతగా ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌ అవతరించింది. నిన్న (ఆగస్ట్‌ 19) జరిగిన ఫైనల్లో ఆ జట్టు సథరన్‌ బ్రేవ్‌పై 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇన్విన్సిబుల్స్‌.. నిర్ణీత 100 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 

విల్‌ జాక్స్‌ 37 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. సామ్‌ కర్రన్‌ 25, జోర్డన్‌ కాక్స్‌ 25, టామ్‌ కర్రన్‌ 24 పరుగులు చేశారు. సథరన్‌ బ్రేవ్‌ బౌలర్లలో టైమాల్‌ మిల్స్‌, అకీల్‌ హొసేన్‌ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్‌ 2, క్రిస్‌ జోర్డన్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.

అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సథరన్‌ బ్రేవ్‌.. నిర్ణీత బంతుల్లో 130 పరుగులకే పరిమితమై, ఓటమిపాలైంది. అలెక్స్‌ డేవిడ్‌ 35, జేమ్స్‌ విన్స్‌ 24, క్రెయిగ్‌ ఓవర్టన్‌ 22 పరుగులతో సథరన్‌ బ్రేవ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఇన్విన్సిబుల్స్‌ బౌలర్లలో సకీబ్‌ మహమూద్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. ఆడమ్‌ జంపా 2, నాథన్‌ సౌటర్‌, విల్‌ జాక్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

హండ్రెడ్‌ లీగ్‌ను ఇన్విన్సిబుల్స్‌ గెలుచుకోవడం వరుసగా ఇది రెండో ఏడాది. ఈ లీగ్‌ తొలి ఎడిషన్‌ను సథరన్‌ బ్రేవ్‌ గెలవగా.. 2022 ఎడిషన్‌ను ట్రెంట్‌ రాకెట్స్‌ గెలుచుకుంది. మరోవైపు నిన్ననే జరిగిన మహిళల హండ్రెడ్‌ లీగ్‌లో లండన్‌ స్పిరిట్‌ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు వెల్ష్‌ ఫైర్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)