Breaking News

వరల్డ్‌కప్‌కు మిస్సయ్యాడు.. కానీ అక్కడ మాత్రం విధ్వంసం! కేవలం 27 బంతుల్లోనే

Published on Wed, 10/25/2023 - 10:45

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ గాయం కారణంగా వన్డే ప్రపంచకప్‌-2023కు దూరమైన సంగతి తెలిసిందే. తొలుత ప్రకటించిన ప్రిలిమనరీ జట్టులో సభ్యునిగా ఉన్న అక్షర్‌.. టోర్నీ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కలేదు. వరల్డ్‌కప్‌కు దూరమైన అక్షర్‌ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు.

ప్రస్తుతం జరగుతున్న సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో గుజరాత్‌ జట్టు తరుపున అక్షర్‌ ఆడుతున్నాడు. ఈ టోర్నీలో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్‌ అద్భుతమైన హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. కేవలం 27 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 పరగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 234 పరుగుల భారీ లక్ష్య చేధనలో గుజరాత్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 197 పరుగులు మాత్రమే చేసింది. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. పంజాబ్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ(112) సెంచరీతో చెలరేగాడు.
చదవండి: World Cup 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌.. టీమిండియాకు భారీ షాక్‌!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)