Breaking News

తన్మయ్‌ అజేయ సెంచరీ

Published on Thu, 11/14/2024 - 01:42

సాక్షి, హైదరాబాద్‌: ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (240 బంతుల్లో 124 బ్యాటింగ్‌; 10 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా ఉప్పల్‌ స్టేడియంలో ఆంధ్ర జట్టుతో మొదలైన రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. 

హైదరాబాద్‌ మాజీ కెపె్టన్‌ తన్మయ్‌ రోజంతా బ్యాటింగ్‌ చేసి అజేయ శతకంతో అలరించాడు. అభిరత్‌ రెడ్డి (114 బంతుల్లో 35; 3 ఫోర్లు, ఒక సిక్సర్‌), హిమతేజ (36; 7 ఫోర్లు) మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. కెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌ (1)తో పాటు రోహిత్‌ రాయుడు (0) విఫలం కాగా.. నితీశ్‌ రెడ్డి (22), వికెట్‌ కీపర్‌ రాహుల్‌ రాదేశ్‌ (22 బ్యాటింగ్‌) ఫర్వాలేదనిపించారు. 

ఆంధ్ర బౌలర్లలో త్రిపురాణ విజయ్‌ 3 వికెట్లు పడగొట్టగా... లలిత్‌ మోహన్, యరా సందీప్‌ చెరో వికెట్‌ తీశారు. తాజా సీజన్‌లో హైదరాబాద్‌ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. ఒక మ్యాచ్‌లో గెలిచింది. మరో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. మొత్తం 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. మరోవైపు ఆంధ్ర జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట ఓడి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది.  

స్కోరు వివరాలు 
హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌: తన్మయ్‌ అగర్వాల్‌ (బ్యాటింగ్‌) 124; అభిరత్‌ రెడ్డి (సి) మోహన్‌ (బి) విజయ్‌ 35; రోహిత్‌ రాయుడు (సి) (సబ్‌) జ్ఞానేశ్వర్‌ (బి) విజయ్‌ 0; హిమతేజ (సి) భరత్‌ (బి) సందీప్‌ 36; రాహుల్‌ సింగ్‌ (సి అండ్‌ బి) విజయ్‌ 1; నితీశ్‌ రెడ్డి (స్టంప్డ్‌) భరత్‌ (బి) మోహన్‌ 22; రాహుల్‌ రాదేశ్‌ (బ్యాటింగ్‌) 22; ఎక్స్‌ట్రాలు 4, మొత్తం (90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 244. వికెట్ల పతనం: 1–91, 2–95, 3–151, 4–152, 5–200, బౌలింగ్‌: శశికాంత్‌ 15–3–32–0; రఫీ 17–3–41–0; 
విజయ్‌ 27–4–85–3; లలిత్‌ మోహన్‌ 23–4–64–1; సందీప్‌ 8–0–18–1.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)