Breaking News

సెమీఫైనల్‌ మ్యాచ్‌.. లంచ్‌కు ముందు ఐదుగురు.. తర్వాత ఒక్కడే.. జనాలు లేక వెలవెలబోయిన నరేంద్ర మోదీ స్టేడియం

Published on Tue, 02/18/2025 - 08:17

 


ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ మైదానమైన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న సుప్రసిద్ధ దేశవాళీ టోర్నీ సెమీఫైనల్‌కు (కేరళ వర్సెస్‌ గుజరాత్‌) సరైన ప్రచారం లేక ప్రేక్షకులు అటువైపే కన్నెత్తి చూడలేదు. దాదాపు లక్షా 30 వేల సామర్థ్యమున్న ప్రేక్షకుల గ్యాలరీలో తొలిరోజు తొలి సెషన్‌లో కేవలం ఐదుగురే మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చారు. భోజన విరామం తర్వాత ఇందులో ఒకే ఒక్కడు మిగిలాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ కావడంతో నెటిజన్స్‌ స్పందించారు. కొందరేమో ప్రేక్షకులను అనుమతించరేమోనని వెళ్లలేదని పేర్కొనగా, మరికొందరు అసలిక్కడ సెమీస్‌ జరుగుతున్న సంగతే తమకు తెలియదని పోస్ట్‌లు పెట్టారు. మరికొందరు క్రికెట్‌ ఔత్సాహికులు అనుమతిస్తున్నారనే బదులు రావడంతో రెండో రోజు నుంచి వెళ్తామని ఆసక్తి చూపారు.    

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేరళ, ఇన్నింగ్స్‌ను చప్పగా ప్రారంభించింది. కెప్టెన్‌ సచిన్‌ బేబీ (193 బంతుల్లో 69 బ్యాటింగ్, 8 ఫోర్లు) జిడ్డుగా బ్యాటింగ్‌ చేశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కేరళ జట్టు 89 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్లు అక్షయ్‌ చంద్రన్‌ (30; 5 ఫోర్లు), రోహన్‌ (30; 5 ఫోర్లు) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. వరుణ్‌ నాయనార్‌ (10) తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు.జలజ్‌ సక్సేనా (30; 4 ఫోర్లు) గుజరాత్‌ బౌలర్ల సహనానికి పరీక్షించాడు. ఆట ముగిసే సమయానికి సచిన్‌ బేబితో పాటు మొహమ్మద​్‌ అజారుద్దీన్‌ (30) క్రీజ్‌లో ఉన్నాడు. గుజరాత్‌ బౌలర్లలో అర్జన్‌ నగస్వల్లా, పి జడేజా, రవి బిష్ణోయ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)