Breaking News

చరిత్ర సృష్టించిన ఒమన్‌ పేసర్‌.. షాహీన్‌ అఫ్రిది రికార్డు బద్దలు

Published on Thu, 07/25/2024 - 09:38

ఒమన్‌ పేసర్‌ బిలాల్‌ ఖాన్‌ వన్డేల్లో తిరుగులేని రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయిని అందుకున్న పేస్‌ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బిలాల్‌కు ముందు ఈ రికార్డు పాక్‌ స్పీడ్‌స్టర్‌ షాహీన్‌ అఫ్రిది పేరిట ఉండేది. షాహీన్‌ 51 మ్యాచ్‌ల్లో 100 వికెట్ల మైలురాయిని తాకగా.. బిలాల్‌ కేవలం 49 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా (పేసర్లు, స్పిన్నర్లు) వన్డేల్లో ఫాస్టెస్‌ 100 వికెట్స్‌ రికార్డు నేపాల్‌ బౌలర్‌ సందీప్‌ లామిచ్చేన్‌ పేరిట ఉంది. లామిచ్చేన్‌ కేవలం​ 42 మ్యాచ్‌ల్లోనే 100 వికెట్ల మైలురాయిని తాకాడు.

ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ లీగ్‌-2 మ్యాచ్‌ల్లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా బిలాల్‌ వన్డేల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నమీబియాపై ఒమన్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన నమీబియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా.. ఒమన్‌ 49.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నమీబియా ఇన్నింగ్స్‌లో మలాన్‌ క్రుగెర్‌ (73) అర్ద సెంచరీతో రాణించగా.. ఆకిబ్‌ ఇలియాస్‌ (68), ఖలీద్‌ కైల్‌ (43) ఒమన్‌ను గెలిపించారు. ఒమన్‌ బౌలర్లలో బిలాల్‌ ఖాన్‌ 3, ఫయాజ్‌ భట్‌ 2, కలీముల్లా, జే ఒడేడ్రా, షోయబ్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టగా.. నమీబియా బౌలర్లలో జాక్‌ బ్రసల్‌ 2, బెన్‌ షికోంగో, తంగెని లుంగమెని తలో వికెట్‌ దక్కించుకున్నారు.

వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన పేసర్లు
బిలాల్‌ ఖాన్‌- 49 మ్యాచ్‌లు
షాహీన్‌ అఫ్రిది- 51
మిచెల్‌ స్టార్క్‌- 52
షేన్‌ బాండ్‌- 54
ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌- 54

వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్లు
సందీప్‌ లామిచ్చేన్‌- 42
రషీద్‌ ఖాన్‌- 44
బిలాల్‌ ఖాన్‌- 49
షాహీన్‌ అఫ్రిది- 51
మిచెల్‌ స్టార్క్‌- 52

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)