Breaking News

ఒలింపిక్స్‌ డబుల్‌ మెడలిస్ట్‌ మనూ బాకర్‌ ఇంట తీవ్ర విషాదం

Published on Sun, 01/19/2025 - 13:49

పారిస్‌ ఒలింపిక్స్‌ డబుల్‌ మెడలిస్ట్‌ మనూ బాకర్‌ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇవాళ (జనవరి 19) ఉదయం మనూ బాకర్‌ అమ్మమ్మ, మామ రోడ్డు ప్రమాదంలో దుర్మణం చెందారు. హర్యానాలోని చర్కీ దాద్రిలో గల మహేంద్రఘర్‌ బైపాస్‌ రోడ్డులో ఈ ఘటన సంభవించింది. 

ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో స్కూటర్‌పై వెళ్తున్న మనూ బాకర్‌ అమ్మమ్మ, మామను బ్రీజా కారు ఢీకొంది. మానూ బాకర్‌ అమ్మమ్మ, మామ స్పాట్‌లోనే చనిపోయారు. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్‌ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్‌ బాడీలను పోస్ట్‌ మార్టమ్‌ నిమిత్తం తరలించారు.

కాగా, మనూ బాకర్‌ రెండు రోజుల కిందటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఖేల్‌ రత్న అవార్డు అందుకుంది. మనూ బాకర్‌ గతేడాది జరిగిన పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించింది. మనూ.. ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడ‌ల్స్ సాధించిన తొలి భార‌తీయ అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో మనూ 10మీ ఎయిర్ పిస్తోల్‌, 10మీ ఎయిర్ పిస్తోల్ మిక్స్‌డ్ టీం (సరబ్జోత్‌ సింగ్‌తో కలిసి) ఈవెంట్ల‌లో కాంస్య పతకాలు సాధించింది.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)