నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా
Breaking News
దిగ్వేష్ సింగ్ అద్భుతం.. ఐదు బంతుల్లో ఐదు వికెట్లు! వీడియో వైరల్
Published on Mon, 06/16/2025 - 20:25
దిగ్వేష్ సింగ్ రాఠీ.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన దిగ్వేష్.. ప్రదర్శనకంటే తన నోట్‌బుక్ సెలబ్రేషన్స్‌తో ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఎందుకంటే ఆ సెలబ్రేషన్స్‌కు గాను ఈ యువ స్పిన్నర్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
అద్బుతమైన టాలెంట్ ఉన్నప్పటికి శ్రుతిమించిన సెలబ్రేషన్స్ అతడి కొంపముంచాయి. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో అతడిపై బీసీసీఐ రెండు సార్లు జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం కూడా ఎదుర్కొన్నాడు. రాఠీ ఓవరాల్‌గా 13 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాము. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ అతడి అద్బుత బౌలింగ్ సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేసింది. ఎంప్రెస్ క్రికెట్ లీగ్‌లో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి21న ఏబీ రైజింగ్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో దిగ్వేష్... సహగల్ క్రికెట్ క్లబ్ తరపున వరుసగా ఐదు బంతుల్లో ఐదు వికెట్లు సాధించాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను లక్నో ఫ్రాంచైజీ అభిమానులతో పంచుకుంది. ఆ మ్యాచ్‌లో దిగ్వేష్ మొత్తంగా 7 వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి జట్టు పతనాన్ని శాసించాడు. 264 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఏబీ రైజింగ్ జట్టు 151 పరుగులకే కుప్పకూలింది.
Digvesh Rathi. 5 stars 🌟 🌟🌟🌟🌟pic.twitter.com/tF4Nw0Gj0Q
— Lucknow Super Giants (@LucknowIPL) June 16, 2025
Tags : 1