Breaking News

సింగిల్స్‌ చాంప్స్‌ ఉన్నతి, కిరణ్‌

Published on Mon, 12/15/2025 - 02:38

కటక్‌: ఒడిశా మాస్టర్స్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నీ సింగిల్స్‌ విభాగంలో భారత్‌కు రెండు టైటిల్స్‌ లభించాయి. మహిళల సింగిల్స్‌లో హరియాణాకు చెందిన 18 ఏళ్ల ఉన్నతి హుడా... పురుషుల సింగిల్స్‌లో కేరళకు చెందిన కిరణ్‌ జార్జి చాంపియన్స్‌గా అవతరించారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ప్రపంచ 28వ ర్యాంకర్‌ ఉన్నతి 21–17, 21–10తో భారత్‌కే చెందిన ప్రపంచ 53వ ర్యాంకర్‌ ఇషారాణి బారువాను ఓడించింది. 

31 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఉన్నతికి తొలి గేమ్‌లో కాస్త పోటీ ఎదురైంది. రెండో గేమ్‌లో మాత్రం ఆరంభం నుంచే ఉన్నతి జోరు కొనసాగింది. పురుషుల సింగిల్స్‌ తుది పోరులో ప్రపంచ 41వ ర్యాంకర్‌ కిరణ్‌ జార్జి 21–14, 13–21, 21–16తో ప్రపంచ 77వ ర్యాంకర్‌ మొహమ్మద్‌ యూసుఫ్‌ (ఇండోనేసియా)పై విజయం సాధించింది. 

65 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో గేమ్‌లో తడబడ్డ కిరణ్‌ నిర్ణాయక మూడో గేమ్‌లో కీలకదశలో పాయింట్లు గెలిచి టైటిల్‌ను ఖాయం చేసుకున్నాడు. విజేతలుగా నిలిచిన ఉన్నతి, కిరణ్‌లకు 8,250 డాలర్ల (రూ. 7 లక్షల 46 వేలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 5,500 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.   
 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)