టీమిండియాపై పాకిస్తాన్‌ హెడ్‌కోచ్‌ ప్రశంసలు!

Published on Fri, 07/03/2026 - 09:57

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు హెడ్‌కోచ్‌ మైక్‌ హసన్‌ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన ఈ జట్టును ఓడించడం అంతతేలికేమీ కాదన్నాడు. పాకిస్తాన్‌తో పాటు ఇతర జట్లు కూడా టీమిండియాను ఓడించేందుకు విఫలయత్నం చేస్తున్నాయని మైక్‌ హసన్‌ పేర్కొన్నాడు.

కాగా ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్‌కప్‌ 2027లో జరుగనున్న సంగతి తెలిసిందే. సౌతాఫ్రికాతో పాటు జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్‌ నిర్వహణకు అక్టోబరు 4- నవంబరు 21 మధ్య షెడ్యూల్‌ ఖరారైంది.

టీమిండియాతో ప్రతి జట్టుకూ అదే సమస్య
ఈ నేపథ్యంలో క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడిన పాక్‌ హెడ్‌కోచ్‌ మైక్‌ హసన్‌ టీమిండియా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత దుర్భేద్యమైన జట్టుగా కనిపిస్తోందన్నాడు. ‘‘గతేడాది ఆసియా కప్‌ టోర్నీలో టీమిండియాపై తప్ప మేము అన్ని మ్యాచ్‌లూ గెలిచాము.

నిజానికి పాక్‌ ఒక్కటే కాదు... ప్రపంచంలోని ఇతర జట్లు కూడా ప్రస్తుతం టీమిండియాను ఓడించేందుకు తీవ్రంగా కష్టపడాల్సి వస్తోంది. మళ్లీ అదే మాట చెప్పేందుకు నేను వెనకాడను. పాక్‌ జట్టుకు మాత్రమే కాకుండా ప్రతి జట్టుకూ ఇదే సమస్య. 

కేవలం అత్యుత్తమ జట్టు మాత్రమే కాదు
తప్పో.. ఒప్పో.. ప్రతి ఒక్కరు ఇండియాతో మ్యాచ్‌ ఫలితంతోనే పాకిస్తాన్‌ జట్టుపై ఓ నిర్ణయానికి వస్తారు. ప్రస్తుతం టీమిండియా ప్రపంచంలోని అత్యుత్తమ జట్టు మాత్రమే కాదు.. అంతకంటే ఓ మెట్టుపైనే ఉందనడంలో అతిశయోక్తి లేదు’’ అని మైక్‌ హసన్‌ గిల్‌ సేనపై ప్రశంసల వర్షం కురిపించాడు.

టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం
కాగా పాకిస్తాన్‌ చివరగా 2017లో చాంపియన్స్‌ ట్రోఫీ రూపంలో ఐసీసీ టైటిల్‌ సాధించింది. ఇక 2022 టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరిన పాక్‌.. ఆ తర్వాత ఈ టోర్నీలో కనీసం సెమీస్‌ కూడా చేరలేక చతికిలపడింది.

మరోవైపు.. వన్డే ఫార్మాట్లోనూ 2011 తర్వాత పాకిస్తాన్‌ కనీసం సెమీస్‌ కూడా చేరలేదు. ఇక టీమిండియా ఇటీవల వరుసగా మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచింది. 2024 టీ20 ప్రపంచకప్‌, 2025 చాంపియన్స్‌ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీలను కైవసం చేసుకుంది.

ఇదిలా ఉంటే.. వన్డేల్లో ముఖాముఖి పోరులో మాత్రం పాకిస్తాన్‌దే పైచేయిగా ఉంది. ఓవరాల్‌గా టీమిండియా పాకిస్తాన్‌ ఇప్పటికి 136 వన్డేల్లో తలపడగా.. పాక్‌ 73, ఇండియా 58 మ్యాచ్‌లు గెలిచాయి. ఐదింటిలో ఫలితం తేలలేదు. అయితే, వరల్డ్‌కప్‌ టోర్నీలో మాత్రం ఇరుజట్లు ఎనిమిదిసార్లు తలపడగా.. టీమిండియా 8-0తో దాయాదిపై సంపూర్ణ ఆధిపత్యం కొనసాగిస్తోంది. 

చదవండి: చరిత్ర సృష్టించిన రొనాల్డో 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)