Breaking News

మెండిస్‌ మెరుపులు! ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ.. చివరికి..

Published on Sat, 04/08/2023 - 10:50

New Zealand vs Sri Lanka, 3rd T20I: శ్రీలంకతో మూడో టీ20లో న్యూజిలాండ్‌ గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. తద్వారా సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. 

అప్పుడలా.. ఇప్పుడిలా
రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23 సీజన్‌లో ఆఖరిదైన సిరీస్‌లో ఓటమి పాలైన లంక.. వన్డే సిరీస్‌లోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది.

వరుస ఓటముల నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌ అవకాశాలను గల్లంతు చేసుకోవడమే గాకుండా.. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీకి నేరుగా అర్హత సాధించే ఛాన్స్‌నూ మిస్‌ చేసుకుంది. తాజాగా మూడో టీ20లో ఓడి ఈ సిరీస్‌ను కూడా ఆతిథ్య కివీస్‌కు సమర్పించుకుంది.

దంచికొట్టిన మెండిస్‌
క్వీన్స్‌టౌన్‌ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కివీస్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఓపెనర్లలో పాతుమ్‌ నిసాంక(25) పర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్‌ కుశాల్‌ మెండిస్‌ మాత్రం అదరగొట్టాడు.

ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ 48 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 73 పరుగులు రాబట్టాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ కుశాల్‌ పెరెరా 21 బంతుల్లో 33 పరుగులు చేయగా.. ధనంజయ డిసిల్వ 9 బంతుల్లోనే 20 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 

మరోసారి చెలరేగిన సీఫర్ట్‌
కానీ కెప్టెన్‌ దసున్‌ షనక(15) మరోసారి నిరాశపరిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి పర్యాటక లంక 182 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ ఓపెనర్లలో టిమ్‌ సీఫర్ట్‌ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఈ సిరీస్ కూడా కివీస్‌దే
48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 88 పరుగులతో కివీస్‌ను గెలుపుబాట పట్టించాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ 31 పరుగులతో రాణించగా.. మరో బంతి మిగిలి ఉండగా రచిన్‌ రవీంద్ర రెండు పరుగులు తీసి కివీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో సిరీస్‌ న్యూజిలాండ్‌ సొంతమైంది. సీఫర్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు అందుకున్నాడు. ఇక శ్రీలంక కివీస్‌ పర్యటన ముగించుకుని ఉత్త చేతులతో ఇంటిబాట పట్టింది.

Videos

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Bhogapuram: అభివృద్ధి సంకల్పం ఆ ఘనత జగన్ దే

చంద్రబాబు నివాసమున్న జిల్లాలోనే మహిళలపై పెరిగిన 11 శాతం నేరాలు

ఇంజనీరింగ్ నిపుణులే షాక్ అయ్యేలా అమరావతిలో భారీ దోపిడీ

AP: సైబర్ దొంగలు కోటి 23 లక్షలు కొట్టేశారు

Perni Nani: చిరంజీవి పెట్టిన బిక్ష

Photos

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)