Breaking News

WTC Final: ఏంజెలో మాథ్యూస్‌ సెంచరీ! టీమిండియాతో రేసులో దూసుకొస్తున్న లంక

Published on Sun, 03/12/2023 - 12:19

New Zealand vs Sri Lanka, 1st Test Day 4- WTC Final Scenario:  ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో అడుగుపెట్టేందుకు శ్రీలంక టీమిండియాతో పోటీ పడుతోంది. తుదిపోరుకు అర్హత సాధించే రేసులో తాము కూడా ఉన్నామంటూ దూసుకొస్తోంది. న్యూజిలాండ్‌ గడ్డపై చరిత్ర సృష్టించి డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు తగ్గట్లుగానే మెరుగైన ఆట తీరుతో ఆకట్టుకుంటోంది.

అంచనాలు తలకిందులు చేస్తూ కివీస్‌తో తొలి టెస్టులో హోరాహోరీ తలపడుతోంది. కాగా ఓవర్‌నైట్‌ స్కోరు 162/5తో మూడో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో లంకపై 18 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. 

డారైల్‌ మిచెల్‌ (193 బంతుల్లో 102; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, మాట్‌ హెన్రీ (75 బంతుల్లో 72; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో ఈ మేర ఆధిక్యం సాధ్యమైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌ మొదలెట్టిన శ్రీలంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు నష్టానికి 83 పరుగులు చేసింది. ఈ క్రమంలో నాలుగో రోజు ఆట ఆరంభం నుంచే దూకుడు కనబరిచింది. 

ఏంజెలో మాథ్యూస్‌ సెంచరీ
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఏంజెలో మాథ్యూస్‌ పట్టుదలగా నిలబడి సెంచరీ సాధించాడు. 235 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 115 పరుగులు చేశాడు. మిగిలిన వాళ్లలో చండీమాల్‌ 42, ధనంజయ డి సిల్వ 47(నాటౌట్‌) రాణించారు. దీంతో లంక తమ రెండో ఇన్నింగ్స్‌ను 302 పరుగుల వద్ద ముగించింది. 279 పరుగుల ఆధిక్యం సాధించింది.

కివీస్‌ అద్భుతం చేస్తుందా?
ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య న్యూజిలాండ్‌ నాలుగో రోజు ఆట ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 28 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే స్టార్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే(5)ను స్వల్ప స్కోరుకే అవుట్‌ చేసి కసున్‌ రజిత దెబ్బకొట్టాడు. టామ్‌ లాథమ్‌ 11, వన్‌డౌన్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఇక నాలుగో రోజు ఆట ముగిసే సరికి కివీస్‌ విజయానికి 257 పరుగుల దూరంలో ఉండగా.. ఆఖరి రోజు లంక తొమ్మిది వికెట్లు తీస్తే గెలుస్తుంది. ఇంకా 90 ఓవర్ల ఆట మిగిలి ఉన్న క్రమంలో ఈ పరిణామాలు కివీస్‌- లంక మ్యాచ్‌ టీమిండియా ఫ్యాన్స్‌ను మరింత ఉత్కంఠలోనికి నెట్టాయి. 

టీమిండియా, శ్రీలంక డబ్ల్యూటీసీ ఫైనల్‌ అవకాశాలు ఎలా ఉన్నాయంటే?!
►స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టును టీమిండియా గెలిస్తే నేరుగా ఫైనల్‌ చేరుకుంటుంది.
►ఒకవేళ న్యూజిలాండ్‌ లంకను తొలి టెస్టులో ఓడించినా, కనీసం ఒక్క మ్యాచ్‌ డ్రా చేసుకున్నా రోహిత్‌ సేన తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. 
►ఇక లంక.. ఆస్ట్రేలియాతో ఫైనల్‌ ఆడాలంటే న్యూజిలాండ్‌ను 2-0తో వైట్‌వాష్‌ చేయడం సహా టీమిండియాపై ఆఖరి టెస్టులో ఆసీస్‌ విజయం సాధించాలి. 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)