విధ్వంసం.. ఊచకోత.. ఎన్ని చెప్పినా తక్కువే, 16 సిక్స్‌లతో పరుగుల సునామీ

Published on Wed, 01/17/2024 - 08:21

న్యూజిలాండ్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్‌ సరసన నిలిచాడు. 2019లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జజాయ్‌ 16 సిక్సర్లు బాదగా.. తాజాగా అలెన్‌ జజాయ్‌ రికార్డును సమం చేశాడు. 

స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అరివీర భయంకర ఫామ్‌లో ఉన్న అలెన్‌.. డునెడిన్‌ వేదికగా జరుగుతున్న మూడో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి 62 బంతుల్లో 16 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో విధ్వంసర శతకం (137) బాదాడు. అలెన్‌ తన సెంచరీని కేవలం​ 48 బంతుల్లోనే పూర్తి చేశాడు. న్యూజిలాండ్‌ తరఫున టీ20ల్లో అలెన్‌దే అత్యుత్తమ స్కోర్‌. దీనికి ముందు ఈ రికార్డు బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (123) పేరిట ఉండింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌.. అలెన్‌ ఊచకోత ధాటికి నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కివీస్‌ ఇన్నింగ్స్‌లో అలెన్‌ ఒక్కడే వన్‌ మ్యాన్‌ షో చేశాడు. టిమ్‌ సీఫర్ట్‌ (31) పర్వాలేదనిపించగా.. కాన్వే (7), డారిల్‌ మిచెల్‌ (8), చాప్‌మన్‌ (1), సాంట్నర్‌ (4) విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో అలెన్‌ విధ్వంసం​ ఓ రేంజ్‌లో సాగింది.

ఈ ఇన్నింగ్స్‌ గురించి విధ్వంసం.. ఊచకోత లాంటి ఎన్ని పదాలు వాడినా తక్కువే అవుతుంది. అంతర్జాతీయ టీ20ల్లో వన్‌ ఆఫ్‌ ద బెస్ట్‌ ఇన్నింగ్స్‌ అని విశ్లేషకులు కొనియాడుతున్నారు. ఈ సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉన్న ఫిన్‌ అలెన్‌ రెండో మ్యాచ్‌లో 74 (41 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు), తొలి టీ20లో 34 (15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేశాడు.

మూడో మ్యాచ్‌లో అలెన్‌ విధ్వంసం ధాటికి పాక్‌ బౌలర్లు  బెంబేలెత్తిపోయారు. షాహీన్‌ అఫ్రిది (4-0-43-1), హరీస్‌ రౌఫ్‌ (4-0-60-2), మొహమ్మద్‌ నవాజ్‌ (4-0-44-1) 10కిపైగా ఎకానమీ రేట్‌తో పరుగులు సమర్పించుకున్నారు. పాక్‌ బౌలర్లలో అలెన్‌ ధాటి నుంచి మొహమ్మద్‌ వసీం జూనియర్‌ (4-0-35-1), జమాన్‌ ఖాన్‌ (4-0-37-1) కాస్త తప్పించుకున్నారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్‌ 9 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసి, ఓటమి దిశగా సాగుతుంది. సైమ్‌ అయూబ్‌ (10), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (24) ఔట్‌ కాగా.. బాబర్‌ ఆజమ్‌ (27), ఫకర్‌ జమాన్‌ (12) పోరాడుతున్నారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్‌ తొలి రెండు టీ20ల్లో ఓడింది. ఈ మ్యాచ్‌లో కూడా ఆ జట్టు ఓడితే మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ కివీస్‌ వశమవుతుంది. 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)