Breaking News

ఫిన్‌ అలెన్‌ ఊచకోత.. పాక్‌ బౌలర్లపై మెరుపుదాడి

Published on Sun, 01/14/2024 - 13:32

న్యూజిలాండ్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఫిన్‌ అలెన్‌ భీకర ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డాడు. స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 15 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసిన అలెన్‌.. తాజాగా జరుగుతున్న రెండో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 41 బంతులను ఎదుర్కొన్న అలెన్‌ 7 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. 

హాఫ్‌ సెంచరీ మార్కును కేవలం 24 బంతుల్లోనే అందుకున్న అలెన్‌ ఆతర్వాత కాస్త నెమ్మదించాడు. మరో భారీ షాట్‌కు ప్రయత్నించే క్రమంలో ఉసామా మిర్‌ అలెన్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. మొత్తంగా పాక్‌ బౌలర్లను ఊచకోత కోసిన అలెన్‌.. క్రీజ్‌లో ఉన్నంత  సేపు మెరుపులు మెరిపించాడు. అలెన్‌ ధాటి​కి న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. పాక్‌ బౌలర్లలో హరీస్‌ రౌఫ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. అబ్బాస్‌ అఫ్రిది 2, ఆమిర్‌ జమాల్‌, ఉసామా మిర్‌, షాహీన్‌ అఫ్రిది తలో వికెట్‌ దక్కించుకున్నారు.  

ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు డెవాన్‌ కాన్వే (15 బంతుల్లో 20; 3 ఫోర్లు), ఫిన్‌ అలెన్‌ కివీస్‌కు  శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 5.1 ఓవర్లలో 59 పరుగులు జోడించారు. కాన్వే ఔటయ్యాక బరిలోకి దిగిన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ క్రీజ్‌లో ఉన్నంతసేపు అసౌకర్యంగా కనిపించాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌ సాయంతో 26 పరుగులు చేసిన అతను ఇన్నింగ్స్‌ 10 ఓవర్ తర్వాత రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. 

తొలి ​మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన డారిల్‌ మిచెల్‌ 17 పరుగులు మాత్రమే చేసి ఔట్‌ కాగా.. తొలి మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన మార్క్‌ చాప్‌మన్‌ 4 పరుగులకే ఔటయ్యాడు. ఆడమ్‌ మిల్నే, ఐష్‌ సోధి డకౌట్లు కాగా.. గ్లెన్‌ ఫిలిప్‌ 13, సాంట్నర్‌ 25 పరుగులు చేశారు. భారీ స్కోర్‌ దిశగా పయనిస్తున్న కివీస్‌ను హరీస్‌ రౌఫ్‌ 19వ ఓవర్‌లో దెబ్బకొట్టాడు. ఈ ఓవర్‌ 1, 2, 4 బంతులకు వికెట్లు పడగొట్టిన రౌఫ్‌.. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి కివీస్‌ భారీ స్కోర్‌ చేయకుండా కట్టడి చేశాడు. కాగా, ఈ సిరీస​్‌లో కివీస్‌ తొలి మ్యాచ్‌లో పాక్‌ను 46 పరుగుల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)