Breaking News

NZ Vs Eng: ఆండర్సన్‌- స్టువర్ట్‌ బ్రాడ్‌ సంచలనం.. 1000 వికెట్లతో..

Published on Fri, 02/17/2023 - 12:16

New Zealand vs England, 1st Test: ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్ల జంట జేమ్స్‌ ఆండర్సన్‌- స్టువర్ట్‌ బ్రాడ్‌ అరుదైన రికార్డు తమ ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్‌లో సంయుక్తంగా 1000 వికెట్లు పడగొట్టిన బౌలర్ల జంటగా చరిత్రకెక్కింది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు రెండో రోజు ఆటలో ఈ ఘనత సాధించింది. తద్వారా సంప్రదాయ క్రికెట్‌లో ఈ ఫీట్‌ నమోదు చేసిన రెండో బౌలర్ల జంటగా నిలిచింది.

గతంలో ఆస్ట్రేలియా దిగ్గజ ద్వయం గ్లెన్‌ మెగ్రాత్‌- షేన్‌ వార్న్‌ 1000 వికెట్ల రికార్డు నెలకొల్పారు. పేసర్‌ మెగ్రాత్‌- స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ 104 టెస్టు మ్యాచ్‌లలో కలిసి ఆడి సంయుక్తంగా 1001 వికెట్లు పడగొట్టి ఆండర్సన్‌- బ్రాడ్‌ జంట కంటే ముందుగా ఈ ఘనత సాధించారు. 

కివీస్‌తో మొదటి టెస్టు తొలి రోజు ఆటలో ఆండర్సన్‌ రెండు వికెట్లు తీయగా.. బ్రాడ్‌ మాత్రం ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. అయితే, రెండో రోజు మొదటి సెషన్‌లో బ్రాడ్‌ నైట్‌ వాచ్‌మన్‌ నీల్‌ వాగ్నర్‌ వికెట్‌ పడగొట్టాడు. దీంతో జేమ్స్‌ ఆండర్సన్‌- స్టువర్ట్‌ బ్రాడ్‌ జంట 1000 వికెట్ల క్లబ్‌లో చేరింది. 

ఇక ఆండర్సన్‌- స్టువర్ట్‌ బ్రాడ్‌ టెస్టుల్లో టాప్‌-5 వికెట్‌ టేకర్ల జాబితాలో కొనసాగుతున్నారు. 178 టెస్టుల్లో 40 ఏళ్ల ఆండర్సన్‌ 677 వికెట్లు పడగొట్టగా.. 36 ఏళ్ల బ్రాడ్‌ 160 మ్యాచ్‌లలో 567 వికెట్లు తీశాడు. శ్రీలంక లెజెండ్‌ ముత్తయ్య మురళీధరన్‌ అత్యధికంగా 800 వికెట్లు,  షేన్‌ వార్న్‌ ఖాతాలో 708 వికెట్లు ఉన్నాయి. భారత దిగ్గజ బౌలర్‌ అనిల్‌ కుంబ్లే 619 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. మౌంట్‌ మాంగనీయ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో మొదటి టెస్టులో ఇంగ్లండ్‌ 325/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. 

చదవండి: Ind Vs Aus- BCCI: బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ రాజీనామా?!
నటాషా నుదుటిన సింధూరం దిద్దిన హార్దిక్‌.. ముచ్చటగా మూడోసారి! పెళ్లి ఫొటోలు వైరల్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)