Breaking News

NZ Vs Aus: న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ

Published on Wed, 02/28/2024 - 10:30

Australia tour of New Zealand, 2024: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ ఆరంభానికి ముందు న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ డెవాన్‌ కాన్వే జట్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని కారణంగా ఈ ఓపెనర్‌ తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు.

కాన్వే స్థానంలో అతడు జట్టులోకి
ఈ విషయాన్ని న్యూజిలాండ్‌ క్రికెట్‌ ధ్రువీకరించింది. ‘‘కీలక మ్యాచ్‌కు ముందు డెవాన్‌ జట్టుకు దూరం కావడం మమ్మల్ని నిరాశకు గురిచేసింది. టాపార్డర్‌లో ఇలాంటి క్లాస్‌ ప్లేయర్‌ సేవలను కోల్పోవడం కష్టంగా ఉంది.

పూర్తిగా కోలుకుని అతడు తిరిగి జట్టుతో చేరతాడని నమ్మకం ఉంది’’ అని కివీస్‌ జట్టు హెడ్‌కోచ్‌ గ్యారీ స్టెడ్‌ పేర్కొన్నాడు. కాన్వే స్థానంలో హెన్రీ నికోల్స్‌ను ఎంపిక చేసినట్లు తెలిపాడు. 

కాగా మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన ఆసీస్‌.. తదుపరి టెస్టు సిరీస్‌పై కన్నేసింది.

రచిన్‌, మిచెల్‌ వచ్చేస్తున్నారు
మరోవైపు.. సొంతగడ్డపై పొట్టి ఫార్మాట్లో కంగారూ జట్టు చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని కివీస్‌ పట్టుదలగా ఉంది. ఇరు జట్ల మధ్య వెల్లింగ్‌టన్‌ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు మొదలుకానుంది.

ఈ మ్యాచ్‌కు యువ సంచలనం రచిన్‌ రవీంద్ర, ఆల్‌రౌండర్‌ డారిల్‌ మిచెల్‌ అందుబాటులోకి రానున్నారు. ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో రెండో టీ20 సందర్భంగా డెవాన్‌ కాన్వే ఎడమచేతి బొటనవేలికి గాయమైంది. దీంతో మూడో టీ20కి దూరంగా ఉన్న అతడు.. తొలి టెస్టుకు కూడా ఆడలేకపోతున్నాడు.

ఆస్ట్రేలియాతో సిరీస్‌కు న్యూజిలాండ్ టెస్టు జట్టు:
టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మ్యాట్ హెన్రీ, స్కాట్ కుగెలిజిన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, నీల్ వాగ్నర్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, హెన్రీ నికోల్స్‌.

చదవండి: Ind vs Eng: లండన్‌కు పయనమైన కేఎల్‌ రాహుల్‌.. కారణం ఇదే!

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)